Natyam ad

చివరి దశకు  అళ్వరావుపల్లి కాల్వ

నల్గొండ ముచ్చట్లు:


ఆలేరు అంటేనే బీడుబారిన భూములు.. ఎండిపోయిన చెరువులు.. వర్షాలు వస్తేనే వ్యవసాయం.. నీళ్లు లేక రైతన్నలు హైదరాబాద్‌కు వలస బాట పట్టేవారు. ఆలేరు, గుండాల మండలాలకు గోదావరి జలాలను అందించేందుకు నిర్మిస్తున్న ఆశ్వరావుపల్లి కుడి ప్రధాన కాలువ పనులు చక చక సాగుతున్నాయి.మొత్తం 35.275 కిలోమీటర్ల కాలువ నిర్మాణానికి గానూ కాలువ ఆధునీకరణ, నూతన కాలువ పనులు, కాలువ గట్ల పటిష్టత, లైనింగ్, స్ట్రక్చర్లు, ఆయా ప్రాం తాల్లో రోడ్లను దాటుతూ స్టక్చర్ల నిర్మాణం, కెనాల్ క్రాసింగ్ పనులు పూర్తయ్యాయి. ఇందు కోసం ప్రభుత్వం రూ. 138 కోట్లు నిధులను మంజూరు చేయగా 75 శాతం పనులు పూర్తి కాగా మరో 25 శాతం పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ కాలువ ద్వారా ఆలేరు నియోజకవర్గంలోని 16,686 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది.దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా ధర్మసాగర్‌తో పాటు ఎగువ ప్రాంతాలకు గోదావరి జలాలు అందుతాయి. దేవాదుల రీ ఇంజినీరింగ్ తర్వాత 415 మీటర్ల మట్టానికి ఎగువన ఉన్న భీంఘన్‌పూర్ నుంచి పాలకుర్తి పంప్‌హౌస్‌కు నీటిని తరలించి ధర్మసాగర్ జలాశయాన్ని నింపుతారు.

 

 

 

ధర్మసాగర్ ఎగువ ప్రాంతా ల్లోని రిజర్వాయర్లకు మోటార్ల ద్వారా లిఫ్ట్, పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోస్తారు. ధర్మసాగర్ జలాశయం నిల్వ సామర్థ్యం 1.5 టీఎంసీలు. ఇది నిండిన తర్వాత ఆర్‌ఎస్ ఘన్‌పూర్ రిజర్వాయర్(1.57 టీఎంసీ), ఆశ్వరావుపల్లి(0.74 టీఎంసీ), చీటకోడూరు(0.30 టీఎంసీ), జలాశయాలను నింపుతారు. ధర్మసాగర్ పంప్‌హౌస్ నుంచి మరో పైప్‌లైన్ ద్వారా గండిరామారం(0.40 టీఎంసీ), బొమ్మకూరు(0.30 టీఎంసీ) జలాశయాలకు నీటిని పంపింగ్ చేస్తారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి పై తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలతో ఆశ్వరావుపల్లి జలాశయం ద్వారా ఆలేరుకు నీటిని అందించేందుకు చేపట్టిన పనులను మరింత వేగవంతం చేయాలని ఆకాంక్షించారు. ఇందుకు అనుగుణంగా ఆశ్వరావుపల్లి ప్రధాన కాలువ నిర్మాణం ప్రస్తు తం పెరిగిన ధరలు దృష్టిలో ఉంచుకుని రూ. 138 కోట్ల నిధుల నుంచి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. స్టేషన్ ఘన్‌పూర్, జనగాం, ఆలేరు నియోజకవర్గాల లో జరుగుతున్న కాలువ పనులు దృష్టిలో ఉంచుకుని నిధులు మంజూరు చేశారు. జనగాం జిల్లాలోని రఘునాథపల్లి మండలంలోని ఆశ్వరావుపల్లి గ్రామంలోనిర్మించిన ఆశ్వరావుపల్లి జలాశయం మైయిన్ రెగ్యూలెటర్ వద్ద ప్రారంభమైన డిస్టిబ్యూటరీ ప్రధాన కుడి కాలువ ద్వారా 35. 275 కిలోమీటర్లు ప్రవహించి ఆలేరు బిక్కేరువాగువరకు నీటిని విడుదల చేస్తారు. ఆశ్వరావుపల్లి జలాశయం నుంచి ఖీలాషాపూర్,

 

 

 

Post Midle

ఇబ్రహీపురం, మాదారం, యశ్వంతపూర్, జనగాం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించబోయే కలెక్టర్ భవనం గుండా కళ్లెంకు వస్తుంది. ఇక్కడి 34 కిలో మీటర్ల వద్దగల శారాజీపేట నుంచి టంగుటూరు వెళ్లే దారిని తాకుతుంది. మరో 1.27 కిలోమీటరు ప్రవహించిన కాలువ సాయిగూడెం నుంచి కొల్లూరు గ్రామంలో ఆలేరు వాగులోకి చేరుకుంటాయి.ఆశ్వరావుపల్లి నుంచి ఆలేరు 35.275 కిలోమీటర్లకు వరకు ప్రధాన కాలువ పనులు 75 శాతం పూర్తయ్యాయి. కాలువ ఆధునీకరణ, పునర్నిర్మాణం పనులు, కాలువ పటిష్టత, సీసీ లైనింగ్‌తో పాటు ఆయా ప్రాంతాల్లో రోడ్లు, రైల్వే గేట్లను దాటుతూ స్టక్చర్ల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. మొత్తం 34 కిలోమీటర్ల కాలువ వెడల్పు పనులు పూర్తికాగా ఆలేరు మండలంలోని కందిగడ్డతండా వద్ద 1.275 కిలో మీటర్ల కాలువ పనులు పురోగతిలో ఉన్నాయి.మొత్తం కాలువ నిర్మాణంలో 70 స్ట్రక్చర్ల నిర్మాణంతో పాటు జాతీయ రహదారి దాటేందుకు 14 కెనాల్ క్రాసింగ్ నిర్మాణాలు, రైల్వే క్రాసింగ్‌ల వద్ద 7 కెనాల్ క్రాసింగ్‌లను అధికారులు పూర్తి చేశారు. ఆశ్వరావుపల్లి ప్రధాన కాలువ పనులు 75 శాతం పనులు పూర్తికాగా మరో 25 శాతం పనులు అందులో డ్రిస్టిబ్యూటర్లు, మైనర్ల పనులు పురోగతిలో ఉన్నాయి.ఆశ్వరావ్‌పల్లి ప్రధాన కాలువు పోడవు 35.275 కిలోమీటర్లు ఉండగా మరో 1.275 డిస్ట్రిబ్యూటరీ కాలువను నిర్మాణం చేపట్టారు. రీచ్ 3లో భాగంగా ఆలేరు నియోజకవర్గంలో 10 కిలోమీటర్ల మాత్రమే ప్రధాన కాలువ ఉంటుంది.

 

 

రీచ్ 2లో భాగంగా 1.275 కిలో మీటర్ల కాలువ పనులుగా విభజించారు. ప్రధాన కాలువతో మొత్తం 10,000 ఎకరాలు, రీచ్3 లో భాగంగా నిర్మాణం చేపడుతున్న డిస్ట్రిబ్యూటరీ కాలువ ద్వారా ఆలేరు మండలంలో టంగుటూరు (2081 ఎక రాలు), పటేల్‌గూడెం 592(ఎకరాలు), శారాజీపేట (3736ఎకరాలు), గొలనుకొండ (3229ఎకరాలు), ఆలేరు (2532 ఎక రాలు), కొల్లూరులో (3086 ఎక రాలు) గుండాల మండలంలోని అనంతారం(1326 ఎకరాలు), వెల్మజాల (104 ఎక రాలు) వరకు మరో 6,686 ఎకరాలు ఆయకట్టు సాగులోకి వస్తాయి. రెండు మండలాల్లో మొత్తం 16,686 ఎకరాలు సాగుకులోకి వస్తాయి.ఆలేరు నియోజకవర్గంలోని ప్రధాన కాలువ ప్రాంతాలలో భూములకు సాగునీరు అందించడంతో పాటు మరో 30 చెరువులకు జలకళ సంతరించుకోనుంది. ఇందులో ఆలేరు 30 చెరువులుండగా, గుండాల మండలంలోని అనంతారంలో ఒక చెరువుతో ఆ పక్కనే ఉన్న 3 కుంటలను గోదావరి జలాలను నింపనున్నారు. ఇందుకు కాలువకు కావాల్సిన తూంల నిర్మాణం, చెరువుల ఫీడర్ చానళ్ల పునరుద్దరణ పనులు పూర్తయ్యాయి.అశ్వరావుపల్లి ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడిన ప్రధాన కుడి కాలువతో ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, గుండాల మండలాలకు సాగు జలాలు అందించ డంతోపాటు ఆలేరు బిక్కేరు వాగులోకి నీటిని పంపు చేస్తారు. దీంతో ఆలేరు పెద్దవాగు(బిక్కేరువాగు) ప్రవహించే ప్రాంతాలైన ఆలేరు మండలంలోని ఆలేరు, సాయిగూడెం, మోటకొండూర్ మండలంలోని ఇక్కుర్తి, అమ్మనబోలు, తేర్యాల, గుండాల మండలంలోని అనంతారం, సుద్దాల, ఆత్మకూరు(ఎం) మండలంలోని పారుపల్లి, మొదగుబావి గూడెం ప్రాంతాల్లో భూగర్భజలాలు సమృద్దిగా పెరిగి బోర్లు, బావుల్లోకి సాగునీరు అందే అవకాశం ఉంది.

 

Tags: Alvaraopalli canal for the last stage

Post Midle