అమలాపురం అల్లర్ల కేసు

నలుగురు వైకాపా నేతలపై కేసు నమోదు
అందరూ మంత్రి విశ్వరూప్ అనుచరులే

 

అమలాపురం ముచ్చట్లు:

అమలాపురం అల్లర్ల కేసులో నలుగురు కీలక వైసిపి నేతల పై కేసు నమోదు అయింది. మంత్రి విశ్వరూప్ అనుచరులు సత్యరుషి వాసంశెట్టి సుభాష్.. మట్టపర్తి మురళీకృష్ణ.. మట్టపర్తి రఘులను పోలీసులు  నిందితులుగా చేర్చారు. ఏ 222 చీకట్ల వీరవెంకటసత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలంతో నలుగురిపైనా కేసు నమోదు చేసారు. నలుగురు నిందితులు కోనసీమలో మంత్రి విశ్వరూప్ అనుచరులు కాగా.. వైసిపి క్రీయాశీలక నేతలు గా గుర్తింపు పొందారు. A225 గా సత్య రుషి..a226 గా వాసం శెట్టి సుభాష్…a227 గా మట్టపర్తి మురళి కృష్ణ…228 గా మట్టపర్తి రఘులు కేసులో నమోదు చేసారు.

 

Tags: Amalapuram riots case