అమర్ అక్బర్ ఆంటోనీ, సవ్యసాచి” చిత్రాల విడుదల తేదీలు ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్ 

Amar Akbar Antony and Silasachi "Maitri Movie Makers who announce release dates

Amar Akbar Antony and Silasachi "Maitri Movie Makers who announce release dates

Date:11/08/2018
హైదారాబాదు ముచ్చట్లు:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో “బాహుబలి” తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “రంగస్థలం” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ తమ బ్యానర్ నుంచి వస్తున్న తదుపరి క్రేజీ ప్రొజెక్ట్స్ అయిన “అమర్ అక్బర్ ఆంటోనీ, సవ్యసాచి” చిత్రాల విడుదల తేదీలను ఇవాళ ప్రకటించింది.
సూపర్ హిట్ కాంబినేషన్ అయిన “రవితేజ-శ్రీనువైట్ల” కాంబోలో వస్తున్న నాలుగో సినిమా “అమర్ అక్బర్ ఆంటోనీ”. ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం అమెరికాలో షూట్ జరుగుతోంది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేసేందుకు నిర్ణయించారు మైత్రీ మూవీ మేకర్స్. “ప్రేమమ్” లాంటి సెన్సిబుల్ లవ్ ఎంటర్ టైనర్ అనంతరం నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సవ్యసాచి” చిత్రాన్ని నవంబర్ 2న విడుదల చేయనున్నారు. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు కీలకపాత్రలు పోషిస్తుండడం విశేషం. ఒక పాట మినహా “సవ్యసాచి” షూటింగ్ పూర్తయ్యింది. “రంగస్థలం” అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మీద ప్రేక్షకులకు విశేషమైన నమ్మకం ఏర్పడింది. అందుకే నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి లు తమ సంస్థ నుంచి రాబోతున్న తదుపరి చిత్రాల విషయంలో విశేషమైన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఈ ఏడాది మాత్రమే కాదు ఎప్పటికీ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తామని మాట ఇస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్.
Tags:Amar Akbar Antony and Silasachi “Maitri Movie Makers who announce release dates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *