నవంబర్ 10 న ‘ అమర్ అక్బర్ ఆంటోనీ ‘ప్రి రిలీజ్

'Amar Akbar Antony' pre-release on November 10

'Amar Akbar Antony' pre-release on November 10

– నవంబర్ 16 న సినిమా విడుదల

Date:05/11/2018

మాస్ మహరాజా రవితేజ, గ్లామర్ బ్యూటీ ఇలియానా జంటగా  శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ అమర్ అక్బర్ ఆంటోనీ ‘..నవంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నవంబర్ 10 న నిర్వహించబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు..ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మొదటి పాటకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన రాగ, రెండవ పాటను దీపావళి సందర్భంగా రేపు విడుదల చేయనున్నారు..  రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్న ఈ సినిమా  స‌రికొత్త క‌థ‌, భిన్న‌మైన‌ నేప‌థ్యంలో తెర‌కెక్కగా   ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తారాగణం: రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్,విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు.

ఎఫ్ 2` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Tags:’Amar Akbar Antony’ pre-release on November 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *