బిసిలకు అమర్‌, అనీషాల షాక్‌ …

Amar and Anusha shock for BC ...

Amar and Anusha shock for BC ...

-బోయకొండ చైర్మన్‌ పదవి అగ్రకులాలకే
– ఆందోళనకు సై అంటున్న బిసిలు.

Date:09/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతు…యాదవ, వాల్మీకి కులస్తులచే నిత్యం పూజలందుకుంటున్న శ్రీ బోయకొండ గంగమ్మ పాలక మండలి చైర్మన్‌ పదవి ఈసారి తిరిగి అగ్రకులస్తులకే దక్కనున్నది. గత పది సంవత్సరాలుగా బోయకొండ చైర్మన్‌ పదవి బిసిలకు కేటాయించాలంటు పోరాటం చేస్తున్న బిసిలకు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి, పుంగనూరు తెలుగుదేశం నూతన ఇన్‌చార్జ్ అనీషారెడ్డిలు షాక్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిని జీర్ణించుకోలేని బిసిలు ఆందోళనకు సిద్దమౌతున్నారు.

చౌడేపల్లె- మండలం దిగువపల్లె గ్రామంలో వెలసిన శ్రీబోయకొండ గంగమ్మ ఆలయ పాలకమండలి చైర్మన్‌తో పాటు డైరెక్టర్‌ పదవులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 28 లోపు ధరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. ఇలా ఉండగా గతంలో ఎస్‌కె.రమణారెడ్డి, ఆయన సతీమణి రతీదేవి రెండు సార్లు చైర్మన్లుగా కొనసాగారు. ఆ సమయంలో బిసిలకు చైర్మన్‌ పదవి ఇవ్వాలని డిమాండు చేస్తూ, జిల్లాలోని బిసి సంఘ నాయకులందరు కలసి తెలుగుదేశం పార్టీ న్యాయసలహాదారు, సీనియర్‌ న్యాయవాది బి.వెంకటముని యాదవ్‌ పేరును తీసుకొచ్చారు. ఇలా ఉండగా ఊహించని రీతిలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది. అధికారం రాగానే అమరనాథరెడ్డికి మామ తెల్లనీళ్లపల్లెకు చెందిన జి.రామక్రిష్ణారెడ్డిని నియమించారు. దీనిపై బిసి సంఘ నాయకుడు గంగరాజు హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేసి, రామక్రిష్ణారెడ్డి దేవాదాయశాఖపై కేసులు దాఖలు చేశారని, ఆయన నియమాకం చెల్లదని వాదించారు. న్యాయస్థానం రామక్రిష్ణారెడ్డి నియామకాన్ని కొట్టివేసింది. ఈ తీర్పుతో కంగుతున్న తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి రామక్రిష్ణారెడ్డి సతీమణి రాజేశ్వరి ని నియమిస్తూ ప్రభుత్వం 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులపై తిరిగి మాజీ చైర్మన్‌ ఎస్‌కె.రమణారెడ్డి న్యాయస్థానంలో రిట్‌పిటిషన్‌ దాఖలు చేశారు. రామక్రిష్ణారెడ్డి సతీమణి రాజేశ్వరి పదవి బాధ్యతలు చేపట్టే సమయానికి హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడంతో ఆమె పదవి బాధ్యతలు చేపట్టక పదవికాలం ముగిసింది. ఇలా ఉండగా ప్రతిసారి బిసిలు చైర్మన్‌ పదవి కోసం పోరాటం చేయడం, వారికి చైర్మన్‌ పదవి దక్కకుండ ఉండటం పరిపాటిగా మారింది. ప్రస్తుత పరిస్థితులలో తెలుగుదేశం ఇన్‌చార్జ్ అనీషారెడ్డి ఆశీస్సులతో చైర్మన్‌ పదవి తనకే దక్కుతుందని ఆశలు పెట్టుకున్న న్యాయవాది వెంకటమునియాదవ్‌కు వెహోండిచెయ్యి మిగిలినట్లు తెలిసింది. ఎస్‌కె.రమణారెడ్డి కి గ్రీన్‌ సిగ్నిల్‌ వచ్చినట్లు తెలిసింది. ఇలా ఉండగా రెండుసార్లు తమ కుటుంభానికి చైర్మన్‌ పదవి వచ్చినా న్యాయస్థానం ఉత్తర్వులతో పదవి దక్కలేదని, ఈ సారి ఎలాగైనా తనకే- ఇవ్వాలంటు రామక్రిష్ణారెడ్డి కుమారుడు , మాజీ సర్పంచ్‌ రమేష్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఈయనకు మంత్రి అమరనాథరెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య పోటీలో బిసిలు కానరాకుండ పోయారు. కాగా పుంగనూరు నియోజకవర్గంలో సుమారు 68 శాతం ఉన్న బిసి కులస్తులకు ఇవ్వకుండ అగ్రవర్ణాలకే బోయకొండ చైర్మన్‌ పదవిని అప్పగించేందుకు ఇటు అమర్‌, అటు అనీషా నిర్ణయించుకోవడంతో బిసిలు ఆందోళనలకు సిద్దమౌతున్నారు. ఈ విషయమై బావ, మరదలు కలసి ఒకటిగా తెలుగుదేశం న్యాయసలహాదారు వెంకటమునియాదవ్‌కు కేటాయిస్తారా..?.లేదా గ్రూపు రాజకీయాలతో ఎస్‌కె.రమణారెడ్డి , రమేష్‌రెడ్డిల్లో ఎవరికి ఇస్తారో అన్న విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారి, తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది.

 

ఏపీ పట్ల సవతి తల్లి ప్రేమ 

Tags: Amar and Anusha shock for BC …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *