Natyam ad

అమరా..!ఆత్మపరిశీలన చేసుకో… పుంగనూరు అభివృద్ధిని మేమే చేశాం

– బంగ్లాలో మాటలకే మీ పాలన పరిమితం
– మాజీ మంత్రి అమరనాథ్‌పై నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ నేతలు

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ముప్పె ఏళ్ల పాలనలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి, వారి కుటుంబం జెడ్పి బంగ్లాలో మాటలకే పరిమితమైయ్యారు…ముప్పె ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలో రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసి చూపించారు…దమ్ము…ధైర్యం ఉంటే పుంగనూరులో అభివృద్ధి పనులపై పరిశీలనకు రా చూపిస్తాం మా అభివృద్ధి ఏమిటో అంటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాలు కలసి మాజీ మంత్రి అమరనాథరెడ్డికి సవాల్‌ విసిరారు. శనివారం సాయంత్రం పట్టణంలోని చింతలవీధి, కుమ్మరవీధి ప్రాంతాలలో గడప గడపకు వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారాన్ని ఇంటింటా నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలకు రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

 

 

ఈ సందర్భంగా బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి అమరనాథరెడ్డి తమ పాలనలో పుంగనూరును అభివృద్ధి చేశామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా వెహోండిగోడలకే పరిమితమైన ఆర్టీసి డిపోను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించి ప్రారంభించిందన్నారు. అలాగే కమీషన్ల కోసం పెండింగ్‌ పెట్టిన బైపాస్‌రోడ్డును ఎంపీ మిధున్‌రెడ్డి స్వయంగా పూర్తి చేయించారని కొనియాడారు. పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు రిజర్వాయర్లను నిర్మించడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. వీటిని అడ్డుకున్న ఘనత మాత్రం పచ్చదండుదేనని కృష్ణమూర్తి ఎద్దెవా చేశారు. అలాగే వంద పడకల ఆసుపత్రి, ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటు, ఎంబిటి రోడ్డు విస్తరణ, మినిబైపాస్‌రోడ్డు, పుంగమ్మ చెరువు కట్ట విస్తరణ, పార్కుల ఏర్పాటు, చెరువులను పటిష్టం చేయడం,

 

 

హంద్రీనీవా నీటిని చెరువులకు అనుసందానం చేయడం లాంటి మహాత్తర కార్యక్రమాలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయించారని స్పష్టం చేశారు. ఈపనుల్లో ఒక్కటైన అమరనాథరెడ్డి కుటుంబం చేసిందా అంటు నిలధీశారు. సిగ్గు…ఎగ్గు లేకుండ అభివృద్ధి పనులపై మాజీ మంత్రి అమరనాథరెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనని మండి పడ్డారు. ఇప్పటికైన అమరనాథరెడ్డి అభివృద్ధి పనుల పరిశీలనకై పుంగనూరుకు వస్తే ఎవరు ఏమి అభివృద్ధి చేశారో ప్రజల సమక్షంలో వివరిస్తామని , దమ్ముంటే మా సవాల్‌ను స్వీకరించి రావాలని కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి, కౌన్సిలర్లు రెడ్డెమ్మ, రేష్మా, కాళిదాసు, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags: Amara..!Introspect…- We ourselves did the development of Punganur

 

Post Midle