అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నూతన శాఖ భూమి పూజ కార్యక్రమం
తిరుపతి ముచ్చట్లు:
రాజన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం, దిగువమాగం గ్రామం నందు అమర రాజా సంస్థల అధినేత గల్లా రామచంద్ర నాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి ముఖ్య అతిథిలుగా పాల్గొని అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నూతన శాఖ కి భూమి పూజ చేసి నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా గా గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ ఇప్పటికే మా స్వగ్రామం అయిన పూతలపట్టు మండలం, పెతమిట్ట గ్రామం నందు 2014 లో అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నీ స్థాపించి అనేకమంది నిరుద్యోగ యువతకు మల్టీ స్కిల్ కింద ఉచితంగా శిక్షణ ఇచ్చి మ కంపెనీ లో మరియు ఇతర కంపెనీలో ఊపాదీ అవకాశాలు పొందేవిందగా చేయటం జరిగినది అదే విధంగా ఇక్కడ పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్దేశం తో 25 కోట్లతో అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నూతన శాఖ నీ ప్రారంభిస్తున్నాము ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ విభాగం,నిర్మాణ రంగాలకు కావాల్సిన మానవ వనరుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ సంస్థ లో ఉచిత శిక్షణ తో పాటు స్టైఫండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది అని తెలియజేశారు.
గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ ఇప్పటికే మా నాన్న గారు పెరుపైన స్థాపించిన రాజన్న ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మరియు ప్రపంచ స్థాయికి తగ్గట్లు గా స్కూల్స్ నీ నడుపుతున్నాము. ఇంకా కూడా వీటిని కొనసాగిస్తూ నూతన కార్యక్రమాలు చేస్తాము అదే విధంగా మా స్వగ్రామం అయిన దిగివమగం నందు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నూతన శాఖ నీ ప్రారంభిస్తున్నాము. ఇ అవకాశాన్ని సమీప గ్రామాల నిరుద్యోగ యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అని కోరుచున్నాను అని తెలియచేశారు.ఈ కార్యక్రమంలో ఘనంగా పూజ కార్యక్రమాలు జరిగాయి మరియు కార్యక్రమంలో మండల లోని వివిధ పార్టీల నాయకులు,సర్పంచులు, సమీప గ్రామాల ప్రజలు మరియు కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:Amara Raja Skill Development Center New Branch Bhoomi Puja Program
