అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగధనుడు

Amarajeevi sriaramulu is great

Date:16/03/2019

చిత్తూరు ముచ్చట్లు:

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా యస్.పి విక్రాంత్ పాటిల్ ఆదేశాలమేరకు శనివారం చిత్తూరులోని ఏఆర్ పెరేడ్ మైదానంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి అడిషనల్ ఎస్‌పి ఏఆర్ చంద్రమౌళి పూలమాల వేసి  శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్‌పి మాట్లాడుతూ ప్రస్తుత సమాజానికి రూపురేఖలు దిద్ది, నూతన జవ సత్త్వాలు ఇచ్చిన మహాపురుషులలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పొట్టి శ్రీరాములు ఒకరు అని తెల్పుతూ, సామాన్య కుటుంబంలో జన్మించి, అనేక సమస్యల్ని ఎదుర్కొని, గాంధీజీ బోధనలతో, సాహచర్యంతో ఆదర్శ జీవితాన్ని ఏర్పరుచుకున్న సుశ్లోకుడు పొట్టి శ్రీరాములు అని ఘనంగా కీర్తించారు. సత్యం, అహింస, త్యాగం అనే మూడు మహా గుణాలు కలిసిన త్రివేణి సంగమంగా పొట్టి శ్రీరాములు జీవిత కథ సాగింది అని, ఆంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై అహింసాయుత సత్యాగ్రహం ద్వార ఆత్మబలిదానం చేసిన ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించి, ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని 15-12-1952 తేదీన అమరజీవి అయ్యాడని తెలిపారు. ఈ కార్యక్రమములో ఏ ఆర్ డిఎస్పి లు కృష్ణ మోహన్,  లక్ష్మి నారాయణ రెడ్డి, ఏ.ఆర్ ఆర్.ఐలు  మహబూబ్ బాష,  మధు, మురళి, పలువురు ఆర్.ఎస్.ఐ లు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలి

Tags:Amarajeevi sriaramulu is great

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *