కస్తూరిబా పాఠశాల అదనపు గదులను ప్రారంభించిన మంత్రి అమరనాథ రెడ్డి

Amaranth Reddy, who started additional rooms in Kasturba school

Amaranth Reddy, who started additional rooms in Kasturba school

Date:16/08/2018

గంగవరం ముచ్చట్లు:

మండల పరిధిలోని కీలపట్ల రహదారిలోని కస్తూరిబా పాఠశాల నందు నూతనంగా నిర్మించిన అదనపు గదుల సముదాయాన్ని గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నూతన కాల్వ అమరనాథ రెడ్డి ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు, వసతి సౌకర్యాలను కల్పించడంకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

 

 

ఈ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు, ఏఎంసీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, జిల్లా తెదేపా కోశాధికారి ఆర్వీ బాలాజీ, మండల విద్యాదికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఏపీ బాండ్ల  బ్రాండ్ క్రెడిట్ ఎవరిది… 

Tags: Amaranth Reddy, who started additional rooms in Kasturba school

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *