నేటికీ అమరావతినే రాజధాని
సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, రైతులకు న్యాయం చేస్తాం.
అన్ని ప్రాంతాలకూ న్యాయం చేసేందుకే వికేంద్రీకరణ నిర్ణయం.
సుప్రీం కోర్టు తీర్పు తర్వాత టీడీపీ నేతలు మౌనం వహించారు.

మా నాయకుడు వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలు తేలి బాధ్యులకు కఠినమైన శిక్షపడాలని కోరుకుంటున్నాం.
తాడేపల్లి ముచ్చట్లు :
రాజధానిపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని, అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్నీ ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా ఎవరికీ అభ్యంతరం లేని పకడ్బందీ చట్టాన్ని తీసుకొస్తామని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు విచారణ గమనించిన వారికి నేటికీ రాజధాని అమరావతి అని క్లియర్‌గా అర్థం అవుతుంది. సమగ్రమైన విధానాలతో మరింత పకడ్బందీగా ఎవ్వరికీ అభ్యంతరం లేని చట్టం తీసుకువస్తామనే చెబుతున్నాం. మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసే ఉద్దేశంతో మూడు రాజధానుల పేరిట వికేంద్రీకరణ చర్యలు చేపడుతున్నామో చట్ట ప్రకారం, న్యాయ ప్రక్రియకు లోబడి ప్రభుత్వం ఒక బాధ్యతగా ఏరకంగా చేయాలో అది పూర్తి చేస్తుంది. హైకోర్టులో అభ్యంతరం రాకపోయి ఉంటే మూడు రాజధానుల అంశం ఇప్పటికే అయిపోయేది. జనవరి 31కు వాయిదా ఉంది. స్పష్టమైన అభిప్రాయంతో ప్రజల ఆకాంక్షల మేరకు వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం.
వికేంద్రీకరణ బిల్లులో ఎటువంటి ఇబ్బంది రాకూడదనే వెనక్కి తీసుకున్నాం.
శాసనసభలో సుదీర్ఘమైన చర్చ తరువాత వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ప్రత్యర్థులు ఎవరైనా సాంకేతిక పరమైన ఇబ్బందులు, లీగల్ సమస్యలు లేవెత్తకుండా, ఎవ్వరికీ అభ్యంతరం లేకుండా మరింత పకడ్బందీగా చట్టాన్ని తీసుకువస్తామనే ఆ బిల్లును వెనక్కు తీసుకుంటున్నామని చెప్పాం. బిల్లు వెనక్కు తీసుకున్న తరువాత కూడా లేని కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు, నిర్ణయాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. దానికి సంబంధించి సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. రాజధాని విషయంలో హైకోర్టు టైమ్ లిమిట్ పెట్టడం వంటి కొన్ని ఇబ్బందికర అంశాలున్నాయి. రాజ్యాంగబద్ధమైన ఒక ప్రభుత్వం చేయగలిగిన పనిలో అనవసరంగా వేలు పెడుతుందనే కామెంట్ సుప్రీం కోర్టు చేసింది వాస్తవం. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా కొందరు ఆరోపణలు చేస్తున్నారు. రైతుల దగ్గర భూమి సేకరించడంలో తప్పులు ఘోరంగా జరిగాయి. ఆ రోజు చంద్రబాబు బలవంతంగా భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ భ్రమ కల్పించారు. 40 ఏళ్లు పట్టే అభివృద్ధిని మూడు, నాలుగేళ్లలో చూపిస్తామని, ఫక్తు స్టాక్ మార్కెట్లో ధరలు ఎక్కువ చూపించి షేర్లు అమ్ముకొని బయటపడేలా ఆరోజున టీడీపీ చేసింది. పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం మాది. ఏ రాజకీయ పార్టీ అయిన రాజకీయ అజెండాతో పొలిటికల్ పార్టీని నడవాలి కానీ,టీడీపీని మాత్రం ఎల్లో మీడియా సంస్థలు నడుపుతున్నట్టు వారి బ్యానర్ ఐటమ్స్చూస్తే అర్థం అవుతుంది. రెండు మీడియా సంస్థలే తెలుగుదేశం అనబడే రాజకీయ పార్టీని నడుపుతున్నట్టుగా అర్ధమవుతుంది.
సుప్రీం కోర్టు తీర్పుతో టీడీపీ నేతలు మౌనం
నిన్నటి సుప్రీం తీర్పు పై మౌనంగా ఉన్న చంద్రబాబు. ఈరోజు మాత్రం వివేకానందరెడ్డి హత్య కేసుపై ట్వీట్ చేశారు. వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ చేస్తున్నామని ఈరోజు ఆర్డర్ ఇచ్చారు. హత్యకు గురైన వైయస్ వివేకానందరెడ్డి వైయస్ఆర్ సీపీ నాయకులు. 2019 ఎన్నికల్లో వైయస్ అవినాష్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తూ ముందురోజు రాత్రి కూడా అక్కడ తిరిగారు. మా పార్టీ అధినేత వైయస్ జగన్‌కు చిన్నాన్న. ఆయన హత్యకు సంబంధించిన దాంట్లో న్యాయం జరగాలని మా పార్టీ కోరుకుంటుంది. పొలిటికల్‌గా వైయస్ జగన్‌ను, వైయస్ఆర్ సీపీని ఎదుర్కోలేక వ్యక్తిగత విషయాలను రాజకీయం చేసి కుట్ర చేస్తున్నారు. చంద్రబాబులా సీబీఐని రానివ్వమని అనడం లేదు. రాజ్యాంగ ప్రకారం ఎవరి బాధ్యతలు, ఎవరి అధికారాలు వారికి ఉంటాయి. ఈ కేసులో రాజకీయాలన్నీ టీడీపీ నుంచి ప్లే చేస్తున్నారు. వాటిని ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వివేకానందరెడ్డి మర్డర్‌ను కూడా ప్రజలకు సంబంధించిన రాజకీయ అంశంగా తీసుకొచ్చి, దీంట్లో ఘోరం జరిగిపోయిందనే భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
Tags: Amaravati is still the capital today
