Natyam ad

తక్కువ రేట్లకే  అమరావతి స్థలాలు

గుంటూరు  ముచ్చట్లు:


ఏపీ రాజధాని అమరావతిలో భాగం అయిన మంగళగిరి ప్రాంతంలో ఇంటి స్థలం కొనాలంటే సామాన్యులకు చాలా కష్టం. కానీ ప్రభుత్వం అక్కడ వేసిన లే ఔట్ తో ఆ సమస్య తీరిపోతోంది. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న  స్మార్ట్‌ టౌన్‌షిప్‌లోని ప్లాట్లను ఈ-వేలం వేస్తున్నారు. ఈ ఫ్లాట్లు కొనుగోలు చేసే వారికి అనేక రకాల రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సులభ వాయిదాల్లో నగదు చెల్లించే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయింది. మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు లే-అవుట్‌లోని 10 శాతం ప్లాట్లు రిజర్వు చేశారు. అలాగే వారికి  20 శాతం రాయితీ కల్పిస్తున్నారు. విశ్రాంత ఉద్యోగులకు 5 శాతం ప్లాట్లను రిజర్వు చేశారు.  ఆసక్తి గలవారు ప్లాట్‌ ధరలో 10 శాతం మొత్తం చెల్లించి ప్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.  అందిన దరఖాస్తులకు ఈ-లాటరీ నిర్వహిస్తారు. అందులో ఎంపికైనవారు ప్లాట్‌ కేటాయించిన నెలలోపు ఒప్పందం చేసుకుని ధరలో 30 శాతం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.  అనంతరం 6 నెలల్లో మరో 30 శాతం మొత్తం, ఏడాదిలోపు మిగిలిన 30 శాతం మొత్తం ధర చెల్లించవచ్చు.  ప్లాట్‌ పొందిన వారు ధర మొత్తం ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తున్నారు. ప్లాట్ ధర మొత్తం ముందే చెల్లిస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తారు.

 

 

 

వాయిదాలో పద్దతిలో అయితే మాత్రం.. మొత్తం వాయిదాలు చెల్లించిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చార్జీల్లోనూ రాయితీ ఉంది. ఎంఐజీలో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం నికర అమ్మకపు ధరలో 60 శాతం మీద మాత్రమే రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఉంటాయి. మిగతా నలభై శాతానికి డిస్కౌంట్ లభిస్తుంది. ఎంఐజీ లే అవుట్‌-2లో మొత్తం 267 ప్లాట్లు ఉన్నాయి.  వీటిలో 200 చదరపు గజాల్లో 68, 240 చదరపు గజాల్లో 199 ఉన్నాయన్నారు. చదరపు గజం ధర రూ.17,499గా నిర్ణయించారు.  ఈ ప్లాట్లను బుక్ చేసుకోవాలకునే ఆసక్తి కలవారు.. పది శాతం ప్రారంభ ధర చెల్లించి నవంబర్‌ 19వ తేదీ లోగా https://migapdtcp.ap.gov.in లేదా https://crda.ap.gov.in వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్లాట్లకు అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉంటాయి. భవిష్యత్‌లో కూడా ఎలాంటి సమస్యా రాలేదు ఇతర వివరాలకు 0866-2527124 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. అయితే అమరావతి నుంచి రాజధానిని ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించేస్తామని ప్రభుత్వం చెబుతూండటంతో..  ఇప్పటి వరకూ పలుమార్లు ఆన్ లైన్ వేలం నిర్వహించినా ప్రయోజనం పెద్దగా స్పందన లేదు. ఈ సారి అనేక రాయితీలు ఇవ్వడంతో ముందుకు వస్తారని సీఆర్డీఏ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

 

Post Midle


మాస్టర్ ప్లాన్ లో మార్పులు
 ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తూ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాజధాని పరిధిలోని ఐదు గ్రామాలలో 900.97 ఎకరాలను కేటాయించింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు.. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లో ఆర్-5 జోనింగ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభ్యంతరాలు, సూచనలను 15 రోజుల్లోగా చెప్పాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో సూచించింది. అక్టోబరు 28 తేదీ నుంచి నవంబరు 11వ తేదీ వరకూ 15 రోజుల పాటు సీఆర్డీఏకు అభ్యంతరాలుంటే చెప్పాలని స్పష్టం చేసింది. సీఆర్‌డీఏ ప్రతిపాదనల ఆధారంగా ఆర్-5 జోన్ పేరిట పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

 

Tags: Amaravati places at low rates

Post Midle