జూలై 1 నుంచి అమర్నాధ్ యాత్ర

Amarnath yatra from July 1

Amarnath yatra from July 1

 Date:12/03/2019

శ్రీనగర్ ముచ్చట్లు:
అమర్నాథ్ యాత్ర ఈ సారి ఆషాడమాస శివచతుర్థి నాడు అంటే జూలై 1నుంచి ప్రారంభమై ఆగస్టు 15 వరకూ కొనసాగనుంది. ఈ యాత్ర మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. గత ఏడాది అమర్నాథ్ యాత్ర 60 రోజులు జరిగింది. ఈ సారి ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు మొదటివారం వరకూ రిజిస్ట్రేషన్ కొనసాగనుంది. దేశంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన 400కు మించిన బ్రాంచీల ద్వారా ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.కాగా ఈసారి అమర్నాథ్ యాత్రకు మరింత కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. అలాగే ఈసారి కూడా 13 ఏళ్ల కన్నా తక్కువ, 75 ఏళ్ల కన్నా ఎక్కవ వయసుగల వారికి యాత్ర చేసేందుకు అవకాశం కల్పించడం లేదు. అలాగే ఆరు నెలలు దాటిన గర్భవతులు కూడా యాత్ర చేసేందుకు అవకాశం లేదు. పుల్వామా దాడి.. సర్జికల్స్ స్ట్రుక్స్.. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
Tags:Amarnath yatra from July 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *