శ్రీకృష్ణుడిని అవమానించిన అమెజాన్..
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా అమెజాన్ కొన్ని వస్తువులను విక్రయిస్తుందని ఆరోపిస్తూ #బాయ్ కాట్ అమోజాన్ హాష్ ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. స్వస్తిక్ గుర్తుతో ఫ్లోర్ మ్యాట్స్‌తో పాటు కృష్ణాష్టమి పండగ సందర్భంగా శ్రీకృష్ణుడిని అవమానించేలా పోస్టర్లను అమెజాన్‌లో ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచిందని నెటిజన్‌లు మండిపడుతున్నారు. అభ్యంతర కరమైన ఫోటోలను షేర్ చేసి హిందువుల మనోభావాల్ని అమెజాన్ దెబ్బతీసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన రాధాకృష్ణుల బంధాన్ని, ప్రేమను అమెజాన్ అవమానించిందని.. అసలు ఇలాంటి అసభ్య చిత్రాలను విక్రయించే ధైర్యం అమెజాన్ ఎలా చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.అటు వెంటనే అమెజాన్‌లో ఆన్‌లైన్‌లో ఉంచిన ఆయా పోస్టర్లను తొలగించి ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలని డిమాండ్ చేస్తూ నెటిజన్‌లు పోస్టులు పెడుతున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పేరుతో అమెజాన్ 20 శాతం సేల్ అంటూ కొన్ని చిత్రాలను అమ్మకానికి పెట్టింది. ఈ సందర్భంగా వెబ్‌సైట్‌లో రాధతో శ్రీకృష్ణుడు ఉన్న అశ్లీల పెయింటింగ్‌ను విక్రయించడంపై హిందూ జాగృతి సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెజాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బెంగుళూరులోని సుబ్రమణ్య నగర్ పోలీస్ స్టేషన్‌లో హిందూ జాగృతి సంస్థ నేతలు ఫిర్యాదు చేశారు.
Tags: Amazon insulted Lord Krishna

