Natyam ad

తిరుమలలో రాజకీయ ప్రస్తావన వద్దన్న అంబటి

తిరుమల ముచ్చట్లు:


ఏపీ జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విజయవాడ నుంచి గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న మంత్రి అంబటి శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు మంత్రి అంబటికి వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల అంబటి రాంబాబు మీడియతో మాట్లాడుతూ…. శ్రీవారి దర్శనం చాలా చక్కగా జరిగిందన్నారు. మీడియాతో నిన్న దురుసు ప్రవర్తన చూపారన్న ప్రశ్నకు తిరుమలలోస్వామి వారి సన్నీలో వేరే విషయాలు మాట్లాడబోనని మాట దాటవేశారు.

 

Tags: Ambati is not a political figure in Tirumala

Post Midle
Post Midle