అంబటి రాంబాబు, అధికార ప్రతినిధి నీచ రాజకీయాలు చంద్రబాబువే

Ambati Rambabu, the spokesperson of the NICA Politics Chandrababu

Ambati Rambabu, the spokesperson of the NICA Politics Chandrababu

Date:1809/2018
విజయవాడ ముచ్చట్లు:
చంద్రబాబు అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేశారు.  కలిసుందాం అనుకున్నాను అన్నారు.  టీ అర్ ఎస్ తో కలవాలి అన్న ప్రేమ సందేశం పంపారు. మరి తెరాస వ్యవహారాల్లో ఎందుకు తలదూర్చారు.  ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత ఎందుకు పారిపోయి వచ్చారని వైకాప అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు ఓటకు నోటు కేస్ తర్వాత రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై ఒకసారి అయినా మాట్లాడారా?  రాహుల్ గాంధీ గతంలో వస్తే నల్ల జెండాలతో నిరసన తెలిపిన మీరు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.  నీచ రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు మాత్రమే.  మోడీతో కలిసి ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు.  కర్నూలు  జిల్లాలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ధర్మాబాద్ అరెస్ట్ వారెంట్ పై నానా హడావుడి చేశారు.  వంగవీటి రాధా కి అన్యాయం చేయాలి అన్న ఆలోచన మా పార్టీకి లేదు, ఆయన విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో గెలిచారు.  అక్కడే ఆయన గెలుస్తారు అని అధిష్ఠానం బావించింది.  లేదా మచిలీపట్నం పార్లమెంట్ ఆప్షన్ ఇచ్చింది. వంగవీటి కుటుంబానికి వైకాపా లో అన్యాయం జరగదు.  తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయి. మా పార్టీ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుందని అయన స్పష్టత నిచ్చారు.  రంగా అభిమానులు పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలి.  చంద్రబాబు కి మహారాష్ట్ర కోర్టు  నోటీసులు ఇస్తే ఇక్కడ ధర్నాలు చేయడం హాస్యాస్పదమని అయన అన్నారు.
Tags:Ambati Rambabu, the spokesperson of the NICA Politics Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *