అంబేద్కర్ అవార్డు గ్రహీత ను సన్మానించిన జడ్పీ చైర్మన్
కమాన్ పూర్ ముచ్చట్లు:
దళిత రత్న అవార్డు గ్రహీత దేవి లక్ష్మీ నరసయ్యను పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఘనంగా సన్మానించారు. ఇటీవల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత రత్న అవార్డు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగాతీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని మంథని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ అభిమానించే నాయకుడు అభినందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందు ముందు మరిన్ని బహుజన ఉద్యమాల వైపు దళిత ఉద్యమాల వైపు పోరాటం చేసి తాడిత పేరిట బడుగు బలహీన వర్గాల అణచివేతకు గురయ్యే సమాజం లోని యువతకు మరి విద్యార్థులకు చేయూతనందించి సేవలందించి మంచి పేరు తీర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ సుందిళ్ల సర్పంచ్ దాసరి రాజలింగం వైస్ ఎంపీపీ భాస్కర్ జడ్పిటిసి శంకర్ లాల్ ఎంపీపీ మాజీ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Ambedkar Awardee honored by ZP Chairman

