Natyam ad

స్వస్థలం చేరిన అంబేద్కర్ కోన సీమ జిల్లా మహిళ

కడప ముచ్చట్లు:

కువైట్ నుండీ ఈ నెల 16న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, డాక్టర్ బి ఆర్  అంబే ద్కర్  కోన సీమ జిల్లాకు చెందిన బాలముడి బాల ఈశ్వరమ్మ ఆను మహిళ గత కొన్ని సంవత్సరాల నుంచి జీవనోపాధి కోసం కువైట్ కు వచ్చి ఏజెంట్ చేతిలో మోసపోయి సరైన పని దొరకకా నానా ఇబ్బందులు పడుతూ అకామా లేని కారణంగా స్వదేశానికి వెళ్లేందు కు ఏపిఎన్ఆర్టీ ఎస్ రీజినల్ కోఆర్డినేటర్ (కువైట్ ) నాయిని మహేశ్వర రెడ్డి ని సంప్రదించగా వెంటనే స్పందించి కువైట్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి ఆమెకు సహాయంగా, పాల తోట మణి, చింతా రెడ్డయ్య రెడ్డిల సహకారంతో, గత రెండు నెలల నుంచి ఆమె యోగ క్షేమాలు చూస్తూ సంబంధిత పేపర్ వర్కు పనులు పూర్తి చేయించినారు. ఆమెను కలిసి ధైర్యం చెప్పి  స్వదేశానికి క్షేమంగా ఈ నెల 16 న పంపినారు.

 

ఈ సందర్బంగా బాల ఈశ్వరమ్మ మాట్లాడుతూ తనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ఏపీఎన్ఆర్టిఎస్ రీజనల్ కోఆర్డినేటర్ నాయిని మహేశ్వర రెడ్డి కి పాల తోట మణి,  చింత రెడ్డయ్య రెడ్డి కి, ధనధన్యవాదాలు తెలిపింది. ముఖ్యంగా రాష్ట్ర యువ ముఖ్య మంత్రి, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి, కువైట్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులకు, వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి కి, ఏపీఎన్ఆర్టీఎస్ చేర్మెన్ మేడపాటి వెంకట్ కి, సి ఇ ఓ దినేష్ కుమార్ కి . డైరక్టర్ బి హెచ్ ఇలియాస్ కి, హృదయ పూర్వక ధన్యవాదలు మరియు కృతజ్ఞతలు తెలియ జేసినారు.ఈ కార్యక్రమాము లో వైఎస్సార్సిపీ కువైట్ కమిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూరు చంద్ర శేఖర రెడ్డి, మీడియా ఇన్చార్జ్ పుల పుత్తూరు సురేష్ రెడ్డి, పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Ambedkar is a woman from Kona Seema district who has reached her hometown

Post Midle

Leave A Reply

Your email address will not be published.