రామసముద్రంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
రామసముద్రం ముచ్చట్లు:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66 వ వర్ధంతి ఘనంగా. నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ లో అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ కుసుమ కుమారి సుందరం, జెడ్పిటిసీ రామచంద్రారెడ్డి లు ముఖ్య అధితి గా విచ్చేసి డా”బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని గజమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, న్యాయ శాస్త్రవేత్తగా కీర్తి గాంచిన మహామేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయన సేవలను కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని సూత్రాలకు అనుగుణంగా నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని తెలిపారు. సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల మరియు వెనుకబడిన, పీడిత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగిదన్నారు.ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్, శేషాద్రి,పవన్, శివ, రమణ, నరసింహులు, చంద్ర, నారాయణస్వామి, అధికారులు, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.

Tags: Ambedkar’s death celebrations in Ramasamudra
