Natyam ad

కరెన్సీ నోట్లపై అంబెద్కర్ చిత్రం ముద్రించాలి

భువనగిరిలో జ్ఞాన మాల  ఉత్సవం
 
యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
 
భువనగిరి పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్  చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలి అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని గత 55 వారాలుగా  నిర్వహిస్తున్న జ్ఞాన మాల  ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని చౌరస్తాలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్  విగ్రహానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గజమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే  మాట్లాడుతూ  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని,  మన దేశం అభివృద్ధి పథంలో ముందడుగు వేయడానికి బిఆర్ అంబేద్కర్  రచించిన రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందని తెలియజేశారు,  కరెన్సీ నోట్లపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  చిత్రపటం ముద్రించే ఉద్యమాని ముందుకు తీసుకెళ్తున్న ఉద్యమ నాయకులకు అభినందలు తెలియజేసారు. వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని  ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి  తెలియజేశారు.ఈ కార్యక్రమంలోఉద్యమ నాయకులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Ambedkar’s image should be printed on currency notes