దోచేస్తున్న అంబులెన్స్ లు

Date:14/09/2020

మెద‌క్ ముచ్చట్లు:

ప్రయివేటు అంబులెన్స్‌ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. శవాలపై కాసుల బేరం ఆడుతున్నారు. కరుణ చూపాల్సిన చోట కర్కషంగా ప్రవర్తిస్తున్నారు. అత్యవసరాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీకి తెగిస్తున్నారు. ప్రజల అవసరం, అమాయకత్వం, పరిస్థితిని అత్యాశతో సొమ్ము చేసుకుంటున్నారు. నగరంలో వీరి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. కరోనా కష్టకాలంలో అందరూ ఉపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉంటే వీరు మాత్రం ఇదే అదునుగా భావించి బాధితుల నుంచి ముక్కుపిండి మరీ భారీగా వసూలు చేస్తున్నారు.సిద్దిపేట పట్టణానికి చెందిన ఓ వ్యక్తి సికింద్రా బాద్‌ గాంధీ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. అతడి మృతదే హాన్ని గాంధీ నుంచి మెదక్‌కు తరలించేందుకు ప్రయి వేటు అంబు లెన్స్‌ నిర్వాహకులు రూ.40వేలు డిమాం డ్‌ చేశారు. చివరికి కుటుంబ సభ్యులు రూ.35వేలకు బేరం కుదుర్చుకున్నారు.ల్ణతిరుమలగిరి ప్రాంతానికి చెం దిన ఓ డ్రైవర్‌ కరోనా బారినపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

 

 

గాంధీ ఆస్పత్రికి కేవలం 8 కిలోమీటర్ల దూరం ఉన్న తిరుమలగిరికి మృతదేహాన్ని తరలించేందుకు రూ.15వేలు డిమాండ్‌ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు రూ.12 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.గ్రేటర్‌ హైదరాబాద్‌లో గాంధీ, టిమ్స్‌, కింగ్‌కోఠి, ఉస్మానియా తదితర ప్రభుత్వాస్పత్రులతోపాటు కొన్ని ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రులకు కొవిడ్‌ చికిత్సలు చేసే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ఆ ప్రాంతాల్లో ప్రయివేటు అంబులెన్స్‌ నిర్వాహకులు తిష్ట వేశారు. స్థానిక అంబులెన్స్‌లతోపాటు ఇతర ప్రాంత ాల్లో ఉన్న వాటిని అద్దెకు తీసుకుని ఆస్పత్రుల వద్ద కాపు కాస్తున్నారు. ఇలా నగర వ్యాప్తంగా దాదాపు 550కిపైగా ప్రయివేటు అంబులెన్స్‌లు ఉన్నట్టు అంచనా. కరోనా బాధితుల పరిస్థితి విషమంగా ఉందనీ, ఇతర ఆస్పత్రులకు తరలించాలని ప్రయ త్నాలు జరుగుతున్నాయంటే చాలు క్షణాల్లో వారికి ఆ సమా చారం చేరిపోతుంది. ఒక్కసారిగా వారి ముందు వాలిపోతుంటారు. బాధితులతో బేరసారాలు మొదలు పెడుతారు. పరిస్థితి ఆందోళనగా ఉంటే 100 కిలో మీటర్ల లోపు రూ.10-15 వేలు, 150 కిలోమీటర్ల లోపు రూ.20 వేలకుపైగా వసూలు చేస్తున్నట్టు సమాచారం.

 

 

కరోనా బాధితుడు మృతి చెందితే ప్రయివేటు అంబులెన్స్‌ నిర్వాహకులు మరీ కర్కషంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చనిపోతే చూసేందుకు సైతం బంధు మిత్రులు రాకపోవడం లాంటి కారణాలను సాకుగా చూపుతూ.. కాసులు దండుకుంటున్నారు. వారి ధన దాహానికి పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలు విలవిల్లాడి పోతున్నారు. హైదరాబాద్‌లో కరోనా పేషెంట్‌ మృతి చెందితే 5 కిలోమీటర్లకు రూ.వేలు, 20 కిలోమీటర్ల లోపు మృతదేహాన్ని తీసుకెళ్తే రూ.20వేలు, శివారు ప్రాంతాలకు 50 కిలోమీటర్ల లోపు దూరం వెళ్తే రూ.25-30 వేల వరకు, 100 కిలోమీటర్లు, ఆ తర్వాత వెళ్లాలంటే రూ.40వేల నుంచి పేషెంట్‌ పరిస్థి తిని బట్టి డబ్బులు గుంజుతున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

 

 

పట్టించుకోని అధికార యంత్రాంగం :ప్రయివేటు అంబులెన్స్‌ నిర్వాహకులు కరోనా బాధిత కుటుంబాల నుంచి వేలాది రూపాయలు దోచుకుంటున్నా.. పట్టించుకునే నాథుడే లేడు. ఈ విషయంలో అధికార యంత్రాగం ప్రేక్షక పాత్ర వహిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఉన్నారా? లేరా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంత తతంగా నడుస్తున్నా ఒక్కరూ పట్టించుకోవవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా కాలంలో ఐదు నెలలుగా అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ పని, జీతాల్లేక అల్లాడుతున్నారు.

 

తెలుగు రాష్ట్రాల సీఎంల‌ మేక‌ప్ పై క‌ధ‌లు

Tags:Ambulances stealing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *