Natyam ad

ఓటర్ జాబితా సవరణ.

కమాన్ పూర్ ముచ్చట్లు:

 

నూతన ఓటర్ జాబితా సవరణ చేసినట్లు తాసిల్దార్ గతి ప్రసాద్ తెలిపారు.కమాన్ పూర్ మండలం లోని    20 పోలింగ్ కేంద్రాలలో  స్పెషల్ సమ్మరి రివిజన్-2023 షెడ్యూల్ క్రమముగా ఈ రోజు అనగా 09.11.2022 రోజున ముసాయిదా ఓటర్ జాబితా(ఫారం-5) ప్రచురించటం జరిగింది. ఇట్టి నూతన ఓటర్ లిస్ట్ తమ బూత్ స్థాయి అధికారి అనగా అంగన్ వాడి టీచర్ వద్ద  నూతన ఓటర్ లిస్ట్ ఉంచటం జరిగింది. ఇట్టి ఓటర్ లిస్ట్ నందు తమ యొక్క పేరు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి, ఓటు హక్కు లేని వారు ఫారం 6 నమోదు చేసుకోవాలి, ఓటు హక్కు లో ఏమైనా తప్పులు ఉన్నట్టు అయితే ఫారం 8 లో దరకాస్తు చేసుకోవాలి, ఎవరైనా ఓటు హక్కు తొలగించాలి అయితే ఫారం 7 లో నమోదు చేయాలి అని తెలుపుతూ గ్రామ పంచాయతీ, పోలింగ్ కేంద్రాల్లో ఫారం 5 నోటీస్ ప్రచురించటం జరిగింది. నూతన ఓటర్ లిస్ట్ తమ గ్రామ బూత్ స్థాయి అధికారి (అంగన్ వాడి టీచర్), తహశీల్దార్ కార్యాలయం నందు అందుబాటులో ఉంచటం జరిగింది.

 

Tags: Amendment of voter list.

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.