అరగంటలో అమెరికా మటాష్ !: ఉత్తరకొరియా
అమెరికాను అరగంటలో ఢీ కొట్టే ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్‌ను ఉత్తరకొరియాఅభివృద్ధి పరిచింది. ఇది 33 నిమిషాల్లో అమెరికాలోని లక్ష్యాలపై గురి తప్పకుండా ఢీ కొంటుందని చైనా అధ్యయనంఒకటి తేల్చింది. ఓపెన్ న్యూక్లియర్ నెట్‌వర్క్ అనలిస్ట్ తియన్రాన్ జుతెలిపిన వివరాలు అమెరికా వెన్నులో వణుకు పుట్టించేవిలా ఉన్నాయి. అమెరికాలో ఇప్పటికే ఉన్న క్షిపణి రక్షక వ్యవస్థ కూడా ఉత్తరకొరియా అభివృద్ధి చేసిన తాజా మిసైల్‌ను గుర్తించలేదట. ఉత్తరకొరియానుంచి ప్రయోగించిన 20 సెకండ్ల వరకూ అమెరికాకు కనీసం గుర్తించడం కూడా సాధ్యం కాదట. అమెరికాలోని తూర్పు తీరాన్ని అలాగే పశ్చిమతీరాన్ని కూడా ఈ క్షిపణి సులభంగా చేరగలదట. హ్వాసోంగ్-15పేరిట ఉత్తరకొరియాలోని కిమ్ ప్రభుత్వంఅభివృద్ధి పరిచిన ఈ అణ్వస్త్ర క్షిపణి రేంజ్ 13 వేల కిలోమీటర్లు.చైనా అధ్యయనంలో వెల్లడైన అంశాలపై అమెరికాలోని బైడెన్ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

Tags;America Matash in half an hour!: North Korea
