కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన అమిత్ షా

Amit Shah fires fire on KCR

Amit Shah fires fire on KCR

Date:15/09/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

గులాబీ దళపతి, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కమల దళపతి అమిత్ షా నిప్పులు చెరిగారు. కేసీఆర్ విధానాలను తూర్పారబట్టారు. తెలంగాణలో పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. తన కుటుంబం కోసమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. 2014లో తెలంగాణకు దళితుడిని సీఎంను చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించారని దుయ్యబట్టారు. కనీసం 2018లోనైనా దళితున్ని సీఎంగా నియమిస్తారో లేదో స్పష్టంగా చెప్పాలన్నారు.

 

కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం అని అమిత్ షా స్పష్టం చేశారు. కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఎంఐఎం చెప్పిన మాట కేసీఆర్ సర్కారు తూచా తప్పకుండా పాటిస్తోందని ఆరోపించారు. తెలంగాణను మళ్లీ రజాకార్ల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అవకాశవాద రాజకీయాలే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు.

 

బీజేపీ ప్రభుత్వం హయాంలో దేశంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని, ఆయా రాష్ట్రాల ఏర్పాటు తర్వాత రాష్ట్రాలన్నీ కలిసి అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని అన్నారు. కానీ ఏపీ, తెలంగాణలో పూర్తివిరుద్ధంగా జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సీఎం అంజయ్య, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పట్ల ఎలా వ్యవహరించిందో తెలుగు ప్రజలందరికీ తెలుసునని అన్నారు.

 

ఇదే సమయంలో తాము వాజ్‌పేయి పట్ల ఎంత గౌరవంగా వ్యవహరించామో ప్రజలందరూ చూశారన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తులుండవని స్పష్టం చేశారు.

సిపిఐ మహాగర్జన ర్యాలీ

Tags:Amit Shah fires fire on KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *