అమిత్ షాకు ఘన స్వాగతం

Amit Shah is a solid welcome
Date:13/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
సికింద్రాబాద్ బేగంపేట విమానాశ్రయం చేరుకున్న భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా కు పార్టీ శ్రేణులు ఘనం స్వాగతం పలికాయి. ఆయనకు బేగంపేట విమానాశ్రయం లో దిగిన అమిత్ షా అక్కడ ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగించలేదు. వెంటనే కార్యకర్తలకు అభివాదం చేసి ,కొద్ది సేపు వారితో గడిపి వేరే సమావేశానికి వెళ్లిపోయారు. దాంతో పెద్ద సంఖ్యలో హజరయిన బీజేపీ కార్యకర్తలు నిరాశతో వెనుదిరిగారు. తరువాత అయన సోమాజిగూడలోని కత్రియా హోటల్ లో ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ నేతలతో సమావేశమయ్యారు. పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.
అమిత్ షాకు ఘన స్వాగతం https://www.telugumuchatlu.com/amit-shah-is-a-solid-welcome/
Tags:Amit Shah is a solid welcome

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *