ఎయిమ్స్‌లోనే అమిత్ షా మకాం

Amit Shah stayed at AIIMS

Amit Shah stayed at AIIMS

 Date:16/08/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
 బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్యం అంతకంతకు క్షీణించడంతో కేంద్ర మంత్రులతో పాటు పార్టీ నేతలు ఎయిమ్స్‌లోనే ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం ఎయిమ్స్‌లో వాజ్‌పేయిని పరామర్శించారు.
కాగా వాజ్‌పేయికి వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మరికాసేపట్లో ఎయిమ్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేయనుంది.కాగా బుధవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు వాజ్‌పేయిని పరామర్శించారు.
అలాగే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డా కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు.  గత 24 గంటల్లో వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని బుధవారం రాత్రి 10.15 గంటలకు ఎయిమ్స్ ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా కిడ్నీ సంబంధిత ఇన్ఫెక్షన్తో వాజ్‌పేయ్ జూన్ 11న ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తూనే ఉన్నారు.
Tags:Amit Shah stayed at AIIMS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *