Natyam ad

అమిత్ షా మాటల్లో అసత్యాలు, అక్కసులే వున్నాయి.

నల్గోండ ముచ్చట్లు:


కేంద్రమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికతో కేసీఆర్ ప్రభుత్వం పడిపోయే సమయం ప్రారంభమైందని మునుగోడు లో సభలో అమిత్ షా అన్నారు. ఈ వ్యాఖ్యలను మంత్రి జగదీశ్ రెడ్డి  ఖండించారు. అమిత్‌షా వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు అమిత్‌షాకు స్క్రిప్ట్ సరిగా రాసివ్వనట్లుందని ఎద్దేవా చేశారు. అమిత్‌షా వ్యాఖ్యలు దొంగే దొంగా అన్నట్లుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమిత్‌షా మాటల్లో అసత్యాలు, అక్కసు తప్ప.. ఇంకేం వినిపించలేదన్నారు. ఓట్లు, సీట్లు, అధికారం తప్ప.. వారికి ఇంకో యావ లేదని విమర్శించారు. మునుగోడు ప్రజలు బీజేపీకి మీటర్ పెట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. మునుగోడు బైపోల్‌లో బీజేపీ డిపాజిట్ కోల్పోవడం ఖాయమని మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

 

Tags: Amit Shah’s words are full of lies and lies.

Post Midle
Post Midle