అమితాబ్‌ నివాసానికిభద్రత పెంపు 

Date:21/02/2021

న్యూఢిల్లీ ముచ్చట్లు:

బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ నివాసం ‘జల్సా’ వద్ద పోలీసులు శనివారం భద్రత పెంచారు. చమురు ధరల పెరుగుదలపై స్పందించడం లేదంటూ కాంగ్రెస్‌ నాయకుడు నానా పటోలే.. అమితాబ్‌ను ఉద్దేశించి రెండు రోజుల క్రితం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భద్రత పెంచడం గమనార్హం. ‘‘ఇది తాత్కాలిక ముందుజాగ్రత్త చర్య’’ అని స్థానిక పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు. భద్రత పెంపునకు కారణం ఏమిటన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. యూపీఏ హయాంలో చమురు ధరలు పెరిగినప్పుడు ట్వీట్లు చేసిన అమితాబ్‌ బచ్చన్, అక్షయ్‌కుమార్‌ తదితర బాలీవుడ్‌ ప్రముఖులు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారని పటోలే విమర్శించిన సంగతి తెలిసిందే. చమురు ధరలు పెరగడంపై వైఖరిని వెల్లడించకుంటే మహారాష్ట్రలో వారి సినిమాల ప్రదర్శనలను, చిత్రీకరణలను అనుమతించబోమని ఆయన గురువారం హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలతో కలిసి అధికారాన్ని పంచుకున్న సంగతి తెలిసిందే.

పుంగనూరులో చట్టాలపై అవగాహన అవసరం – న్యాయమూర్తి బాబునాయక్‌.

Tags: Amitabh’s home security enhancement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *