అమ్మా బైలెల్లినాదో. తల్లీ బైలెల్లినాదో..” గోల్కొండ కోటలో బోనాల జాతర

Date:15/07/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పణతో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటపై కొలువై ఉన్న శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, పద్మారావులు పట్టువస్త్రాలు సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అమ్మవారి వేషధారణలో వివిధ కళారూపాలను ప్రదర్శించిన కళాకారులు అందరిని ఆకట్టుకున్నారు.ఇదే రోజు గోల్కొండ అమ్మవారికి పాతబస్తీ శ్రీ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల అనంతరం పాతబస్తీతో పాటు నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉత్సవాలు కొనసాగుతాయి.’అమ్మా బైలెల్లినాదో… తల్లీ బైలెల్లినాదో..’ అంటూ భక్తులు సందడిగా ఆలయానికి చేరుతున్నారు. పోతరాజుల హంగామా, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలు భాగ్యనగర వాసుల్లో ఉత్సాహాన్ని నింపుతుండగా, ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాల పండగను అధికారికంగా నిర్వహిస్తుండటంతో ఎటువంటి లోపాలు, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

అమ్మా బైలెల్లినాదో. తల్లీ బైలెల్లినాదో..” గోల్కొండ కోటలో బోనాల జాతరhttps://www.telugumuchatlu.com/amma-bailellinado-thalli-bailellinado-bonanza-janatha-in-golconda-fort/

Tags Amma bailellinado. Thalli Bailellinado .. “Bonanza Janatha in Golconda Fort

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *