Natyam ad

కోరిన కోర్కెలు తీర్చే అమ్మ బోయకొండ గంగమ్మ-15నుంచి దసరా మహ్గత్సవాలు

— తొమ్మిది రోజులపాటు కొనసాగనున్నపూజలు
— రూ:5116 చెల్లించి ఉభయదారులుగా పాల్గొనాలి

చౌడేపల్లెముచ్చట్లు:

Post Midle

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆలయంలో అక్టోబరునెల 15 వతేదిఆదివారం నుంచి 23 వతేది సోమవారం వరకు తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా శరన్నవ దసరా మహ్గత్సవాలను నిర్వహిస్తున్నట్లు బోయకొండ ఆలయ ఈఓ చంద్రమౌళి తెలిపారు.కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా పేరొందిన బోయకొండ అమ్మవారికి కన్నుల పండువగా బ్రహ్గ్మత్సవాలు నిర్వహించనున్నారు.ఈ మహ్గత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా ప్రారంభించారు. భక్తులకు రోజూ వారీ సేవల వివరాలను తెలియజేయడానికి పోస్టర్లు ముద్రించి జిల్లా వ్యాప్తంగా నే కాకుండా పొరుగుర్ఖా•లైన కర్ణాటక, తమిళనాడు లో ఏర్పాటు చేశారు.బోయకొండలో నిర్వహించే మహ్గత్సవాల్లోభాగంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివి ధ రూపాలలో అలంకరించి భక్తులను దర్శన భాగ్యం కల్పించనున్నట్లు చెప్పారు.

 

 

 

ఆలయ చరిత్ర…..
జిల్లాలోని పుంగనూరు పట్టణానికి 14 కి.మీ దూరంలో గల శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం ప్రసిద్దిగాంచిన దేవాలయాల్లో ఒకటిగా వెలసింది. భారతావని నవాబులు పాలించే సమయంలో దక్షిణ భారతంలో కూడా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలేనే ధ్యేయంతో తమ సేనలతో దండయాత్రలు చేస్తున్నారు. అక్కడి జమిందారులను పాలేగాళ్ళను జయించి తమ ఇష్టానుసారంగా పన్నులను వసూలు చేస్తున్న సమయమిది. పుంగనూరు సంస్థాన పరిసర ప్రాంతాలపై నవాబుల కన్నుపడింది.గోల్కొండ నవాబులు సైన్యాలను పుంగనూరు ప్రాంతముపై దండెత్తి గ్రామాలలో చొరబడి దాడులు చేయడం వెహోదలుపెట్టారు. ప్రజలు భయబ్రాంతులై చెల్లాచెదురయ్యారు. పుంగనూరు వైపు వస్తున్న నవాబు పదాతిదళాలు చౌడేపల్లె వద్ద ఉన్న అడవులలో నివశించే బోయల, ఏకిల గూడెలలో ప్రవేశించి బీభత్సం స-ౖష్టించారు. ఎందరో మహిళలు బలాత్కారానికి సైతం గురయ్యారు.పౌరుషంతో ఎదుర్కొన్న అనేకమంది బలయ్యారు.నవాబుసేనలు కూడా హతమయ్యారు.తగ్గిన సేనతో వెనుతిరిగారు.మరలా గోల్కొండ నుంచి విస-తసేన పుంగనూరుకు చేరింది. ఈ విషయం తెలుసుకొన్న బోయలు, ఏకిల దొరలు భయంతో కొండ గుట్టకు వెళ్ళి తలదాచుకొని జగజ్జనని ని ప్రార్థించారు.వీరివెహోర ఆలకించి శక్తి స్వరూపిణి అవ్వరూపంలో వచ్చి బోయలకు ధైర్యం చెప్పిందని ప్రతీతి. నవాబుసేనలను ఆవ్వరూపంలో ఉన్న శక్తి స్వరూపిణి తన ఖడ్గంతో హతమార్చడం ప్రారంభించింది.అమ్మవారి ఖడ్గదాటికి రాతిగుండు సైతం నిట్ట నిలువుగా చీలిపోయాయి. (ఇప్పటికీ కొండపై నిట్టనిలువుగా చీలికనిపించే అతిపెద్ద రాతిగుండును మనం ద ర్శించవచ్చును) నవాబు సేవలను హతమార్చిన అమ్మవారిని శాంతిపచేయడానికి ఒకమేకపోతును బలి ఇచ్చి తమతో పాటు ఉండమని ప్రార్థించారు. వారి కోరిక మేరకు వెలసిన అమ్మవారిని దొర బోయకొండ గంగమ్మగా పిలువడం పరిపాటి అయింది. కొండపై హిందువులు కట్టుకొన్న సిర్తారికోట, నల్లమందు పోసిన గెరిశెలు, గుట్టకింద అమ్మనీరుతాగిన స్థలం గుర్తులు,గుండ్లుకు సైన్యం గుర్తులు , ఉయ్యాల ఊగిన గుండ్లు అమ్మవారి మహిమలకు శాశ్వత నిదర్శనాలు.

 

 

పవిత్రమైన పుష్కరిణి తీర్థం…..
కొండపై వెలసిన అతి సుందరమైన అమ్మవారి ఆలయం సమీపాన ఉన్న పుష్కరిణిలోని నీరు అతిపవిత్రమైన తీర్థంగా భావిస్తారు. ఈ తీర్థంను సేవించడం వలన సకల రోగాలు మటు మాయం అవుతాయని , పంటలపై తీర్థాన్ని చిలకరించిన చీడలు తొలగును. దుష్టసంబందమైన గాలి భయాలు ధూరమగునని భక్తుల విశ్వాసం.రూ:20 లకే బాటిల్‌తో సహా తీర్థములను భక్తులకు అధికారులు అందుభాటులో ఉంచారు.

 

 

శ్రీ అమ్మవారి పుష్పము మహిమ….
భక్తులు తమ కోరికలు నేరవేరుతాయా లేదా అని తెలుసుకొనుటకు అమ్మవారి శిరస్సుపై మూడు పుష్పములు ఉంచి కోరికలను మనస్సులో స్మరించమంటారు. అమ్మవారు కుడివైపున పుష్పము పడినచో కోరికలు తీరుతాయని, ఎడమవైపు పడినచో ఆలశ్యముగా నెరవేరుతుందని, మధ్యలో పడితే తటస్థముగా భావించుచూ అమ్మవారి మాటగా వారి మనోవాంచితములు దిగ్విజయముగా కొనసాగించుకొనుచున్నారు.

 

 

15 నుంచి తొమ్మిది రోజులపాటు అలంకారముల వివరాలు……..
ఈనెల 15వవతేది ఆదివారం శ్రీబాలాత్రిపుర సుంద రిదేవి అలంకారం , 16న సోమవారం శ్రీ పార్వతిదేవిఅలంకారం,17న మంగళవారం శ్రీ మహాలక్ష్మిదేవిఅలంకారంలో దర్శనిమిచ్చేలా ఏర్పాట్ల చేశారు. అలాగే 18న బుధవారం శ్రీ ధనలక్ష్మిదేవి అలంకారం,19న గురువారం శ్రీశాఖాంబరిదేవి అలంకారం,20న శుక్రవారంశ్రీసరస్వతిదేవి అలంకారం,21న శనివారం శ్రీదుర్గాదేవి అలంకారం,22న ఆదివారం శ్రీ మహిషాసురమర్థినిదేవి అలంకారం. 23న సోమవారం శ్రీరాజరాజేశ్వరిదేవి ఆలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నట్లు తెలిపారు.

 

 

.రవాణా మార్గాలు…..
చౌడేపల్లె నుంచి బోయకొండ ఆలయం వద్ద 12 కిమీ దూరం కలదు. ఈమార్గంలో ఆర్టీసీ బస్సుసౌకర్యం కలదు. అలాగే పుంగనూరు నుంచి బోయకొండ కు 14 కిమీ దూరం కలదు. ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. అలాగే మదనపల్లెనుంచి బోయకొండకు 16 కిమీ దూరం కలదు. ఇక్కడినుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు.ఇక్కడినుంచే కాకుండా బెంగళూరునుంచి బోయకొండకు ప్రత్యేకంగా కర్ణాటక ఆర్టీసీ బస్సు సర్వీసులున్నాయి. గతంలో గతుల రోడ్లులతో భక్తులు ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం డబుల్‌ రోడ్డు ఏర్పాటుచేయడంతో ప్రయాణానికి సులభతరంగా మారింది.కొండ కింద నుంచి ఆలయం వరకు ప్రవేటు వాహనాల ద్వారా ప్రయాణం చేయడానికి ఆలయ అధికారులు సౌకర్యం కల్పించారు.

 

 

భక్తులకోసంప్రత్యేక సౌకర్యాలు….

దసరా మహ్గత్సవాల సంధర్బంగా అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చే యాత్రికులకు అవసరమైన సదుపాయాలు, దర్శన సౌకర్యాలపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆలయ ఈఓ చంద్రమౌళి చెప్పారు. రోజుకొక అలంకారం చొప్పున బోయకొండపై తొమ్మిది ఆర్చిలను సైతం ఏర్పాటు చేయనున్నారు.దసరా మహ్గత్సవాల్లో పాల్గొన దలచిన ఉభయదారులు రూ:5116 చెల్లించాలన్నారు. . అలాగే దుర్గా సప్తశతి చంఢీహ్గమం(పౌర్ణమిరోజున) పాల్గొను ఉభయదారులు రూ:2116 చెల్లించి ఉభయదారులుగా

 

 

పాల్గొనవచ్చునని తెలిపారు.శ్రీఘ్రఫలదాయిని పూజలో పాల్గొను భక్తులు రూ:516 చెల్లించాలన్నారు. ప్రతి ఆదివారం, మంగళవారం మాత్రమే నిర్వహిస్తారన్నారు. ఉత్సవాల్లోభాగంగా ఉభయదారులచే అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు ఊంజల్‌సేవ, అభిషేకం,గణపతి,చంఢీహ్గమములు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఉభయదారులకు అమ్మవారి ప్రసాదము, పవిత్రమైన శేషవస్త్రం, చీరతో పాటురవికపీసు,అమ్మవారి కుంకుము,గాజులు,అమ్మవారి మెవెహోంటో ఇవ్వనున్నట్లు ఈవో చంద్రమౌళి పేర్కొన్నారు.ఉభయదారుల నమోదుకోసం 7901642845,7901642846 నెంబరుకు సంప్రదించాలని కోరారు.

Tags:Amma Boyakonda Gangamma, who fulfills the wishes, Dussehra Mahgatsavala from 15

Post Midle