అమ్మా …సమస్యలు ఉంటే చెప్పండి -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

అమ్మా…అన్నా…మీ సమస్యలు ఏమైనా ఉంటే చె ప్పండి తక్షణమే పరిష్కరిస్తాం, సంక్షేమ పథకాలు వివరాలు , జగనన్నబావుట పుస్తకంలో తెలియజేశాం…మీకు ఈ పథకాలు అందాయి కదా…సంతోషంగా ఉన్నారు కదా…అంటు గడప గడపకు కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. బుధవారం మండలంలోని దిగవచీరు, అడవినాథునికుంట, బైనపల్లె, రాగానిపల్లె గ్రామాల్లో జెడ్పిటీసీ జ్ఞానప్రసన్న , ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వ్యక్తిగత సమస్యలైనా , గ్రామ సమస్యలైనా తెలియజేస్తే తప్పకుండ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గడప గడపకు పంపి ప్రజల కష్టాలు తెలుసుకోమని ఆదేశించారని తెలిపారు. ఏ సమస్యనైనా గ్రామాల్లోనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పీఏ చంద్రహాస్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రాజారెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Amma … tell me if there are any problems -MPP Bhaskar Reddy

 

Post Midle
Natyam ad