అమ్మవారి ఆశీర్వాదం జిల్లా ప్రజలపై ఉండాలి

-లోకమాత పోచమ్మతల్లి
– మహిమాన్వితమైన దేవత
-జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ

జగిత్యాల ముచ్చట్లు:

స్వయం భూగవెలిసిన లోకమాత పోచమ్మతల్లి ఆశీర్వాదం జగిత్యాల జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోరారు. జగిత్యాల పురానిపేటలో వెలిసిన లోకమాత పోచమ్మ తల్లి 60 వ వార్షికోత్సవ సందర్బంగా జగిత్యాల ఆర్డీఓ దుర్గ మాధురి, సీనియర్ జర్నలిస్ట్ రంగారావు, ఆలయాకమిటి సభ్యులతో కలిసి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అరుణశ్రీ మాట్లాడుతూ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని పేర్కొన్నారు. మహిమన్వితమైన దేవత పోచమ్మతల్లి అని, అమ్మవారి ఆశీస్సులతో జిల్లా వాసులంతా సుఖ సంతోషాలతో ఉండాలని పోచమ్మ తల్లిని అరుణశ్రీ వేడుకున్నారు. ఆర్డీఓ మాధురి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం జగిత్యాల ప్రాంతం కలరా వ్యాధి బారినపడి ప్రజలు మృతి చెందుతుంటే స్వయంబూ వెలిసిన పోచమ్మ తల్లికి ఉత్సవాలు, పూజలు చేయడంవల్ల ప్రజలు వ్యాధి బారినుండి బయటపడింది సుఖ సంతోషాలతో ఉన్నారని, ఇఅమ్మవారి గురించి పెద్దలు చెబుతారని అన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి ఏటా అమ్మవారికి ఉత్సవాలు జరుపడం అనవాయితీగా వస్తుందని చెప్పారు. కరోనా మహమ్మారిని పారధ్రోలి ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నానని ఆర్డీఓ మాధురి తెలిపారు. ప్రజలు ఉత్సవాళ్ళో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని సూచించారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు గాజుల రాజేందర్, రాజ గోపాలాచారి, నాగమళ్ళ గంగాధర్, కౌన్సిలర్ మూలస్తం లలిత, మల్లికార్జున్,  రాఘవచారి, హరి, సుగుణకర్, గంగాధర్, విశాల, సుజాత, రాజమణి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Amma’s blessings should be on the people of the district

Leave A Reply

Your email address will not be published.