క్రైస్తవ సంఘాల అందోళన
నూజివీడు ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపాలంటూ నూజివీడులో ఆల్ ఇండియా క్రైస్తవ సంఘం ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ నిమ్మగడ్డ చంద్రకుమార్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో క్రైస్తవ మత గ్రంథం బైబిల్ ను కాల్చివేయడం రాజ్యాంగబద్ధంగా క్రైస్తవులకు కల్పించిన హక్కులను కాలరాయడమే అని వార్నారు. భారతదేశంలో స్త్రీకి ఒక ప్రత్యేక స్థానం ఉందని, క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న సేవకురాలిని దుర్భాషలాటంతో పాటు ఆమె పట్ల నీచంగా ప్రవర్తించడం దారుణమని అన్నారు. ఈ ర్యాలీలో నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి, చాట్రాయి మండలాల ఆల్ ఇండియా క్రైస్తవ సంఘాల నాయకులు తదితరులు పాల్గోన్నారు.

Tags; Among the Christian communities
