Natyam ad

జనంలోనే ..పెద్దాయన

– ఏటా రెండుసార్లు పర్యటన
-భాస్కర్‌రెడ్డి ట్రస్టుతో విరాళాలు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రతి ఒక్కరు పెద్దాయనగా పిలుస్తారు. ఈయన ప్రతియేటా రెండు సార్లు చిన్న, పెద్ద తేడా లేకుండ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు పరిష్కరించడం ఆయన నైజం. ఆపదలో ఉన్న వారికి భాస్కర్‌రెడ్డి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రజలే తన జీవితం అని ఆహర్నిశలు వారి కోసం పని చేయడంతో ఆయన జిల్లాలో తిరుగులేని నేతగా నిలిచారు.

 

పర్యటన- ఇలా …

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిత్యం జనంలోకి వెళ్లేందుకు వేకువజాము నుంచి సిద్ధమౌతారు. నియోజకవర్గంలో మున్సిపాలిటితో పాటు ఆరు మండలాలు ఉన్నాయి. అవి పుంగనూరు మున్సిపాలిటిలో 31 వార్డులు ఉన్నాయి. అలాగే పుంగనూరు , చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు కలవు . వీటిలో 106 పంచాయతీలు, 876 గ్రామాలు ఉన్నాయి. ఏడాది రెండుసార్లు పల్లెబాట పేరుతో ప్రతిపల్లెకు వెళ్లి జనంతో మమేకమవుతారు. ఒక్కో పల్లెను రెండుసార్లు ఈ కార్యక్రమం ద్వారా సందర్శిస్తే..అధికారిక, పార్టీ కార్యకర్తలు, ప్రజల ఆహ్వనం మేరకు సాగించే పర్యటనలతో ఏడాదంతా ప్రజలతో గడిపేస్తారు. ఈ పర్యటనల్లో పెద్దిరెడ్డి అందరిలో సామాన్యడిలా కలిసి ఎవరు ఏమి చెప్పినా ఆలకించడం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడం చేస్తారు.

సేవ కార్యక్రమాలు…

మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన భాస్కర్‌ ట్రస్ట్ ద్వారా కోట్లాది రూపాయలు విరాళాలుగా అందించారు. ఆలయాలకు, మసీదులకు, చర్చిలకు విరాళాలు ఇచ్చారు. అలాగే మెకానిక్‌లకు ర్యాంప్‌ల కోసం సుమారు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆనారోగ్యంతో బాధపడే వారికి వైద్యసేవలు అందించారు. వికలాంగులకు ఎలక్ట్రికల్‌ ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. తోపుడు బండ్లు, వీధి వ్యాపారులకు సోలార్‌ దీపాలు అందించారు.


అభివృద్ది పరుగులు …………

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముప్పె ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించారు. మున్సిపాలిటిలో విద్యుత్‌ను ఆదా చేసేందుకు రూ.6 కోట్లతో సోలార్‌ప్లాంటు ఏర్పాటు చేశారు. ప్రజలు మానసిక ఉల్లాసంతో ఉండేందుకు 6 పార్కులు ఏర్పాటు చేశారు. ఆర్టీసి డిపో , వందపడకల ఆసుపత్రి, ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటు, మినిబైపాస్‌రోడ్డు, బైపాస్‌రోడ్డు , ఎంబిటి రోడ్డు విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేశారు. అలాగే తాగునీరు-సాగునీరు అందించేందుకు రెండు రిజర్వాయర్లను నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. ఈ పనులను తెలుగుదేశం నాయకులు అడ్డుకోవడంతో బ్రేక్‌ పడింది. అలాగే కర్నాటక సరిహద్దు జాతీయ రహదారిని రొంపిచెర్ల రహదారికి అనుసందానం చేయించారు. ప్రతి గ్రామంలోను సిమెంటు రోడ్లు, మురుగునీటి కాలువలు, వీధులు ఏర్పాటు చేశారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మించి ఆర్‌వో ప్లాంట్లు నిర్మించారు. సచివాలయాలు, ఆర్‌బికెలు , వైఎస్సార్‌ విలేజ్‌ క్లీనిక్‌లు నిర్మించారు. పడమట నియోజకవర్గంలో విద్యుత్‌ సమస్యలు పరిష్కరించేందుకు 27 సబ్‌స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల ఫ్యాక్టరీ నిర్మించారు. అలాగే ఆర్టీవో కార్యాలయము, ట్రాన్స్కో డీఈఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

 

Tags; Among the people..Peddayana

Post Midle