Natyam ad

విద్యార్దుల అందోళన

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖలో గురుద్వార్ టిపిటి కాలనీలో ఉన్న వసంత బాల విద్యోదయ ఎయిడెడ్ పాఠశాల విద్యార్ధులు ఆందోళనకు దిగారు.దాతల సహాకారంతో పాఠశాల నిర్వహణ కొనసాగుతూ వచ్చిన పాఠశాల ప్రైవేట్ వ్యక్తుల చేతికి చేరడంతో ఫీజుల భారం విద్యా ర్ధుల తల్లితండ్రులకు ఆర్దిక భారంగా మారింది.ప్రస్తుతం వసంత బాల పాఠశాలలో సుమారు 350 మంది పేద విద్యార్థులు చదువుతున్నారు.దాతలు, విద్యార్థుల తల్లిదండ్రుల సహాయంతో 1975లో రిజిస్ట్రేషన్ చేశా రు.అయితే అది కాస్తా ప్రైవేట్ వ్యక్తుల చేతికి చేరడంతో ఆ యాజమాన్యం ఫీజులు 25 వేలు కట్టాలని, ఫీజులు కట్టకపోతే టిసిలు తీసుకొని వెళ్లిపోవాలని చెప్పడంపై ఆందోళనకు దిగారు.గతంలో విద్యార్ది సంఘాలు ధర్నాలతో దిగి వచ్చిన విద్యాశాఖ జోక్యం చేసుకొని ప్రభుత్వం ఈ పాఠశాలను స్వాధీనం చేసుకొని నిర్వ హిస్తుందని హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చక పోవడం విద్యార్ధుల చదువుకు ఆటంకంగా మారింది. దీనికి తోడు ప్రభుత్వమే స్కూల్లో ఉన్న ఎయిడెడ్ ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు బదిలీ చేసి పేద విద్యార్థుల భవిష్యత్ అందకారం మారుతోందని విద్యా ర్ధులు తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నా రు.ఫీజు లు చెల్లిస్తేనే విద్యార్ధులకు అనుమతిస్తామని చెప్పడం తో అక్కడే బైఠాయించారు.విద్యార్ధుల సమస్యలపై జిల్లా అధికారులు స్పందించాలని వారు కోరుతు న్నారు.

 

Tags: Among the students

Post Midle
Post Midle