పేద వధువుకు పుస్తె మట్టెలు అందజేసిన- ఎం ఎల్ ఏ రఘునందన్

దుబ్బాక ముచ్చట్లు:

మండలంని పెద్ద గుండవెల్లి గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సహకారంతో నిరుపేద కుటుంబానికి చెందిన తాడి చెట్టు సుమలత వివాహానికి పుస్తె మట్టెలు అందజేయడం జరిగింది. వారి రావి చెట్టు బాలయ్య .అమృత కుమార్తె వివాహానికి పుస్తె మట్టెలు అందజేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావు కి గ్రామ ఎంపీటీసీ రవి కి బీజేవైఎం మండల కార్యదర్శి మల్లు అశోక్ కి కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు సంజీవ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ బిజెపి నాయకులు జాలిగామ్ నవీన్ , చిన్ని మల్లారెడ్డి వేల్పుల రాజు ,దండు రాజు, బిట్ల బాలరాజ్ పవన్ ,గణపురం రేవంత్ ,తదితరులు పాల్గొన్నారు. మును ముందు కూడా ఎమ్మెల్యే సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు.

 

Tags: MLA Raghunandan donates bookshelves to poor bride

Leave A Reply

Your email address will not be published.