పుంగనూరు గ్రంధాలయాల్లో శిక్షణ పోస్టర్లు విడుదల

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు గ్రంధాలయాలల్లో వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు , పోస్టర్లను ఎంఈవో కేశవరెడ్డి , గ్రంధాలయాధికారి విజయకుమార్‌ కలసి విడుదల చేశారు. మంగళవారం గ్రంధాలయంలో ఎంఈవో మాట్లాడుతూ విద్యార్థులకు ఉదయం యోగా, స్పోకన్‌ ఇంగ్లీష్ , పుస్తక పఠనం, చిత్రలేఖనం, ఉత్తమ కథలను వివరించడం జరుగుతోందన్నారు. విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణా తరగతులలో విద్యార్థులు పాల్గొని తమ మేదోశక్తిని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్ధూ గ్రంధాలయాధికారి నసీబ్‌జాన్‌, విశ్రాంత తెలుగు పండితులు వెంకటపతి, రామలింగప్ప తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Training posters released at Punganur libraries

Leave A Reply

Your email address will not be published.