Natyam ad

కార్పొరేషన్ గా అమరావతి

గుంటూరు ముచ్చట్లు:
ఎట్టకేలకు అమరావతి రాజధాని ప్రాంతాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ రాజధాని అమరావతినినగరపాలక సంస్థగా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్  కార్పొరేషన్(ఏసిసిఎంసి)గా మార్చనుంది. ఇందులో భాగంగా  రాజధానిలోని 19 గ్రామాలను ఈ కార్పొరేషన్ పరిధిలో చేర్చనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.  తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను సేకరించాలని  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తుళ్ళూరు మండలంలోని 16 గ్రామాలను అమరావతి మున్సిపల్ సిటీ కార్పొరేషన్ (ఏసిసిఎంసి)లో విలీనం చేసేందుకు  ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్‌ను ఆదేశించింది ప్రభుత్వం. దాని ప్రకారమే నోటిఫికేషన్‌ ఇచ్చారు గుంటూరు జిల్లా కలెక్టర్‌.ఇదిలావుంటే ఏపీ రాజధాని  తరలింపుపై మెత్తబడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రజలకు శుభవార్త చెప్పారు. రాజధాని అమరావతి ప్రాంతంలో శాసన  రాజధానిని ఏర్పాటు చేస్తామని.. విశాఖపట్నంకు పరిపాలనా రాజధానిని తరలిస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం జగన్  ప్రకటన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న అమరావతి ప్రాంత రైతులు.. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ  తరుణంలోనే మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర అసెంబ్లీలో ఉపసంహరించుకున్న జగన్ ప్రభుత్వం కొంతకాలంగా సైలెంట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో  అమరావతి ప్రాంత ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంతాన్ని నగరపాలక సంస్థగా ఏర్పాటు  చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాజధాని నగరం పేరుతో కార్పొరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధానిలోని 19  గ్రామాలను అమరావతి క్యాపిటల్‌ సిటీ కార్పొరేషన్‌గా మార్చనున్నారు.ఈ మేరకు గ్రామ సభల నిర్వహణకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ నోటిఫికేషన్‌  జారీ చేశారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తుళ్లూరు మండలంలో 16, మంగళగిరి  మండలంలోని 3 గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని సంబంధిత అధికారులను గుంటూరు కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో  త్వరలోనే అమరావతి ప్రాంతంలోని 19 గ్రామాలు క్యాపిటల్ సిటీగా మారనున్నాయి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Amravati as a corporation