రాజధానిగా అమరావతిని కొనసాగించాలి

Date:05/08/2020

విజయవాడ ముచ్చట్లు:

రాజధాని అమరావతిలో కొనసాగించాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్షాలు నిరసనకు దిగాయి.  ఈ కార్యక్రమానికి  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సి హెచ్ బాబురావు,  రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, వనజ, న్యూ డెమోక్రసీ నాయకులు బ్రహ్మయ్య, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు సుందర రామరాజు, ఎంసిపి ఐ నాయకులు ఖాదర్ భాష హజరయ్యారు.  మధు మాట్లాడుతూ అమరావతిని కొనసాగించాలి, ఉ త్త రాంద్ర, రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయించాలి. ఆ ప్రాంతాల అభివృధి చేస్తామని గతంలో చెప్పారు. ఇంతవరకు అమలు జరగలేదు. కేంద్రం లో వున్న బీజేపీ కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేసింది.  రాజధాని ఏర్పాటు సమయంలో చంద్ర బాబు ఎవరితోనూ సంప్రదించ లేదు. టిడిపి రాజధానిగా చేశారు. ప్రతిపక్షాలను కనీసం పరిగణన లోకి తీసుకోలేదు. మిగిలిన ప్రాంతాలను విస్మరించారు. అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఇప్పుడు జగన్ కూడా అలాగే చేస్తున్నారు. ఎవరితోనూ సంప్రదించ కుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నతీరు చంద్రబాబు విధానాల మాదిరిగానే వుంది. ఇప్పుడు కూడా ప్రతి పక్షాలను పట్టించుకోవడం లేదు.

 

 

రాయలసీమ ఉతరాంధ్రకు నిధులు లేవు. రాజధాని గాఢ అంధకారంలోకి వెళ్ళింది. టిడిపి మీద రాజకీయంగా వ్యతిరేకత వుంటే దానిపై చూసుకోవాలి. రాజధాని పై కాదు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా వుంది.  ఉత్తరాంధ్ర , రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయించాలి. ప్రతేక ప్యాకేజీ ప్రకితించాలని అన్నారు.రామకృష్ణ మాట్లాడుతూ జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. ప్రజలను చీట్ చేశారు. బీజేపీ తో కలిసి డ్రామాలు ఆడుతున్నారు. అమరా వతి ని కొనసాగిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలి.  కరోనా తీవ్రంగా వుంటే దాన్ని పట్టించుకోకుండా రాజధాని అంటు ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికీ 1500  వందల మంది చనిపోయారు. ఆరోగ్యశ్రీ  అంటేచికిత్స చేయడం లేదని అన్నారు.బ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇప్పుడు బీజేపీ నాయకులు మాట మార్చారు. కులాల రాజధానిగా మర్చ కూడదు. ఖాదర్ భాష మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.

కాకతీయ కాలువ లో దూకిన యువతి

Tags: Amravati should continue to be the capital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *