గొంతుతడపని అమృత్ 

Date:14/04/2018
ఏలూరు ముచ్చట్లు:
జిల్లాలో పలు పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించేలా అమృత్‌ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదటి విడత పనులు కేవలం 18 నెలల్లో  పూర్తి చేయాల్సి ఉండగా 10 నెలలు గడుస్తున్నా పనుల తీరు వెక్కిరిస్తోంది. ఏలూరు తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో పనులు సజావుగా సాగకపోవడంతో అభివృద్ధి పనులపై నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. 12, 13వ ఆర్థిక సంఘ నిధులతో చేపట్టిన పనులు ఇప్పటికీ సద్వినియోగం చేయక పోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. అదే పరిస్థితి ఏర్పడితే సగం సగం పనుల నడుమ దాహార్తితో అలమటించక తప్పదని ప్రజలు వాపోతున్నారు.అమృత్‌ పథకం రెండు విడతల్లోనూ మూడు పట్టణాలకు రూ. 221.34 కోట్లు విడుదల కాగా పనులు డిసెంబరు నెలాఖరునాటికి పూర్తిచేయాల్సి ఉంది. భీమవరంలో పరిశీలిస్తే.. బీ అమృత్‌లో తొలి విడతలో విడుదలైన నిధులు: రూ. 47 కోట్లు బీ హెడ్‌వాటర్‌ వర్క్స్‌ నుంచి బుధవారం మార్కెట్‌ వరకు ప్రధాన పైపులైను ఏర్పాటుకు: రూ. 8 కోట్లు బీ పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పైపులైన్ల ఏర్పాటుకు: రూ. 20 కోట్లు బీ ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఏర్పాటుకు: రూ. 7 కోట్లు బీ నిర్వహణ, ఇతర ఛార్జీల రూపంలో అయ్యే ఖర్చు: రూ. 12కోట్లుఇటీవల కాలంలో వేగవంతంగా విస్తరించిన ప్రాంతాల్లో నర్సయ్యఅగ్రహారం ఒకటి. ఇక్కడ ప్రస్తుతం రూ. 2.34 కోట్ల అమృత్‌ నిధులతో సర్వీసు రిజర్వాయర్‌ నిర్మించనున్నారు. ఇంతకీ దీని సామర్థ్యం 12 లక్షల లీటర్లు.  బీ 29వ వార్డులో గొల్లవానితిప్పరోడ్డు వెంబడి ఇటీవల కాలంలో 5 కాలనీలు ఏర్పడ్డాయి. ఇక్కడ నిత్యం దాహం కేకలే. తాగునీటి సమస్యను పరిష్కరించేలా రామలక్ష్మణ్‌నగర్‌లో 10లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన సర్వీసు రిజర్వాయర్‌ను రూ. 2.03 కోట్లుతో నిర్మించనున్నారు. . బీ 39వ వార్డులో నీటి ఇబ్బందులు అధిగమించేందుకు 10 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ. 2.03 కోట్లు కేటాయించారు. ఇంతకీ ఆయా ప్రాంతాల్లో శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా అంగుళం పని జరగక పోవడం కొసమెరుపు. అమృత్‌లో మొదటివిడత పనులు ఇలా ఉండగా రెండోవిడతలో విడుదలైన రూ. 52 కోట్లతో చేపట్టే పనులపై పూర్తి ప్రణాళిక తయారు చేశారు.  బీ వేండ్రవెళ్లే రహదారిలో ఉన్న 63 ఎకరాల విస్తీర్ణంలో మరో చెరువు తవ్వకం పనులు చేపట్టనున్నారు. మరోవైపు తాడేరురోడ్డులోని 82 ఎకరాల పరిధిలో రెండెకరాల విస్తీర్ణంలో మురుగునీటి శుద్ధి ప్లాంటు నిర్మించాల్సి ఉండగా ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చాలంటే మొదటివిడతలో పూర్తిచేసిన పనులకు బిల్లులు చెల్లిస్తేనే చేపడతామని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.ఏలూరు నగరపాలక సంస్థకు మొదటి విడతలో విడుదలైన రూ.3 కోట్లతో పైపులైన్ల ఏర్పాటు, కుళాయి కనెక్షన్లు, పోస్టల్‌కాలనీలో పార్కు అభివృద్ధి చేయ నిర్ణయించారు. రెండో విడతలో రూ. 5.23 కోట్లు మంచినీటి సరఫరాకు విడుదల కాగా మురికినీరు శుద్ధిచేసి విడుదల చేసేందుకు అవసరమైన ప్లాంటు నిర్మాణానికి రూ. 37.48 కోట్లు విడుదలయ్యాయి. తొలి విడతలో రూ. 15.4 కోట్లు, రెండో విడతలో రూ. 31.64 కోట్లు విడుదలయ్యాయి. 32వ వార్డులోని కడకట్లలో సర్వీసు రిజర్వాయర్‌ నిర్మాణం, హెడ్‌వాటర్‌ వర్క్స్‌లో సంపు, కడకట్ల వరకు ప్రధాన పైపులైను ఏర్పాటు, ఇంటింటా కుళాయి కనెక్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. మురికి నీటిని శుద్ధి చేసేందుకు రూ. 32.1 కోట్లు విడుదలయ్యాయి.గతకొన్నేళ్లుగా పట్టణాల్లో ఉన్న శిథిలపైపులను తొలగించి వాటిస్థానే కొత్తపైపులను ఏర్పాటు చేస్తున్నారు. దీనికితోడు ఇంటింటా కుళాయిలను అమర్చే పనులతో పట్టణాలో రహదారులు గుల్లయ్యాయి. ఏ వీధి చూసినా గోతుల మయంగా మారాయి. గతేడాది జూన్‌లో పనులు ప్రారంభించినా వర్షాల వల్ల పనులు ఆలస్యమవుతున్నాయంటూ కొన్ని నిలిపివేశారు. ప్రస్తుతం ఎండలు ఠారెత్తిస్తుండగా నిధులు నీరసించి పనులకు ఆటంకం ఏర్పడింది.అమృత్‌ నిధులతో చేపట్టిన పనులను జీవో 47ను అనుసరించి ప్రజారోగ్య విభాగానికి అప్పగించారు. తొలి విడత నిధులతో చేపట్టిన పనులను డిసెంబరు 2018 నాటికి, రెండో విడత డిసెంబరు 2020కి పూర్తి చేయాలనేది లక్ష్యం. అయితే రెండు విడతల్లోని నిధులతో చేపట్టే పనులను మార్చి 2019 నాటికే అంటే తొమ్మిది నెలలు ముందుగానే పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినా ప్రస్తుత తీరును చూస్తే ఎంతకాలానికి పూర్తవుతాయో అనే అనుమానం వ్యక్తమవుతోంది. జిల్లాలోని మూడు పట్టణాల్లో మొదటి విడతలో పూర్తిచేసిన పనులకు రూ. 12 కోట్లు చెల్లించాల్సి ఉంది.
Tags: Amrith

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *