Amul tribute to Karuna

కరుణకు అముల్ ఘన నివాళి

 Date:11/08/2018
చెన్నై ముచ్చట్లు:
కరుణానిధి.. ది తమిళ్ తలైవార్ అంటోంది ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రికి నివాళులర్పిస్తూ.. సంతాపంగా ఓ ట్వీట్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమూల్ తన ట్వీట్‌లో ‘ది తమిళ్ తలైవార్.. ఎం.కరుణానిధి.. 1924-2018 అంటూ ఫోటో పెట్టారు. అందులో వీల్‌ఛైర్‌లో కూర్చొన్న కరుణకు.. అమూల్ బేబీ షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు ఉంది. అలాగే కరుణానిధిని గొప్ప రచయిత, రాజకీయ నేతగా అభివర్ణించింది. ఈ ట్వీట్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్వీట్‌ను 1600పైగా రీ ట్వీట్లు రాగా.. 5,00వేలకుపైగా లైక్‌లు వచ్చాయి. అంతేకాదు కొంతమంది కరుణ అభిమానులు ఈ ట్వీట్ చూసి ఎమోషనల్ అయ్యారు. నేటిజన్లంతా అమూల్ క్రియేటివీటికి ఫిదా అవుతున్నారు. గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Tags:Amul tribute to Karuna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *