Natyam ad

11ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడపగా పక్కనే మందుకొట్టిన తండ్రి..

-కూలిపోయిన విమానం

 

బ్రెజీల్‌ ముచ్చట్లు:

Post Midle

బ్రెజీల్‌లో ఓ విమానం కూలిన ఘటనలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు 11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడుపుతుండగా తండ్రి పక్క సీట్లో బీర్ తాగినట్టు కనిపిస్తున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం కూలిపోయే ముందే ఆ వ్యక్తి విమానాన్ని తన కొడుకుకు ఇచ్చాడా అనే విషయాన్ని తేల్చేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.జులై 29న గారాన్ మాయా అనే పరిశోధకుడు తన పదకొండేళ్ల కుమారుడు ఫ్రాసిస్కో మాయాతో కలిసి ట్విన్ ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ బేరాన్ 58 విమానంలో బయలుదేరాడు. ఆ తరువాత కొద్ది సేపటికే విమానం అడవిలో కూలిపోయింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆ తండ్రీకొడుకులు రాండోనియా నగరం నుంచి బయలుదేరారు. మధ్యలో విల్హేనా ఎయిర్‌పోర్టులో ఇంధనం నింపుకునేందుకు దిగారు. ఆ తరువాత బాలుడిని క్యాంపో గ్రాండేలోని అతడి తల్లి వద్ద దిపేందుకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

 

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో గారాన్ తన కుమారుడికి విమానం ఎలా నడపాలో చెపుతుండటం స్పష్టంగా కనిపించింది. నిబంధనల ప్రకారం, కనీసం హైస్కూల్ చదువు పూర్తి చేసి 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే విమానాలు నడిపేందుకు అర్హులు. ఆ వ్యక్తికి తన కుమారుడి భద్రతపై ఎంత శ్రద్ధ ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోందని అధికారులు వ్యాఖ్యానించారు. మరోవైపు, భర్త పిల్లలను కోల్పోయిన దుఃఖాన్ని తట్టుకోలేకపోయిన గారాన్ భార్య, వారి అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటలకే ఆత్మహత్య చేసుకుంది.

 

Tags: An 11-year-old boy was driving a flight while his father was shot by his side.

Post Midle