అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఆటోమొబైల్ షాపు
గన్నవరం ముచ్చట్లు:
గన్నవరం లోని స్థానిక సినిమా థియేటర్స్ సెంటర్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ లలో ప్రమాదవశాత్తు ఆటోమొబైల్ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. శ్రీ శ్రీనివాస ఆటోమొబైల్ షాపు యజమాని మడతల గురువారెడ్డి గా గుర్తించారు. గన్నవరం బీట్ పోలీసుల సహాయంతో సమాచారం అందుకున్న గన్నవరం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనలో ఆటోమొబైల్ షాపులోని స్పేర్ పార్ట్స్ సామాన్లు పూర్తిగా దగ్ధమైయాయి. అర్ధరాత్రి కావడంతో మూసివేసిన ఆటోమొబైల్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరాగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న గన్నవరం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Tags: An automobile shop gutted in a fire
