Natyam ad

మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం  

మంథని ముచ్చట్లు:

ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ పై ఈడీ విచారణ పేరుతో కక్ష సాధింపు చర్యలకు నిరసనగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే,  దుద్దిల్ల శ్రీధర్ బాబు  ఆదేశాల మేరకు మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,  సెగ్గం రాజేష్, పట్టణ   అధ్యక్షులు పోలు శివ ల ఆధ్వర్యంలో  మంగళవారం మంథని  అంబేద్కర్ చౌరస్తలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సెగ్గం రాజేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాలను చేపట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై ఈడీ విచారణ చేయడాన్ని తాము  ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలపై బిజెపి ప్రభుత్వం బురదజల్లే కార్యక్రమం చేపట్టిందని, రాబోయే కాలంలో బిజెపికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్రు రమాదేవి, ఆయేషా ఆరిఫ్, గోటికార్ కిషన్ జీ, జంజర్ల శేఖర్,  పెరవేన లింగయ్య యాదవ్, మంథని సత్యం, బండారి ప్రసాద్, మాచిడి సత్యనారాయణ, వేల్పుల పోచం, రావికంటి సతీష్, బండ కిషోర్ రెడ్డి,అరెల్లి కిరణ్ గౌడ్, ఎరుకల ప్రవీణ్, నాగుల రాజయ్య లతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: An effigy of Prime Minister Modi was burnt under the auspices of the Congress party in Manthani

Post Midle

Leave A Reply

Your email address will not be published.