Natyam ad

జమ్మూలో ఆగమోక్తంగా క్షీరాధివాసం

జమ్మూ ముచ్చట్లు:

జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఆగమోక్తంగా క్షీరాధివాసం నిర్వహించారు.  వైదిక కార్యక్రమాల్లో భాగంగా ఉదయం బింబశుద్ధి కోసం క్షీరాధివాసం నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు,  గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాలకు గోవు పాలతో అభిషేకం చేశారు. అదేవిధంగా ఆలయ విమానగోపురం, ధ్వజస్తంభాలను అద్దంలో చూపి పాలతో అభిషేకం చేశారు. అంతకుముందు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన  వేణుగోపాలదీక్షితులు, కంకణభట్టార్  రామకృష్ణ దీక్షితులు, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవోలు  గుణభూషణ్ రెడ్డి,  శివప్రసాద్, ఇఇ సుధాకర్, డెప్యూటీ ఇఇలు  రఘువర్మ,  చెంగల్రాయలు, ఏఈవో  కృష్ణారావు, ఏఈ సీతారామరాజు, సూపరింటెండెంట్  సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్  సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:An endemic mammal habitat in Jammu

Post Midle