రుణ యాప్ ల కట్టడికి కసరత్తు

-కలెక్టర్ ను కలిసిన మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి

కడప ముచ్చట్లు:

సులువైన రుణ సదుపాయం పేరిట ఎర వేసి.. బకాయిలు చెల్లించాలని వేధింపులకు పాల్పడుతున్న రుణ యాప్ కంపెనీల కట్టడికి రాష్ట్ర మహిళా కమిషన్ పూనుకుంది. ఇందులో భాగంగా మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు తో ఆయన చాంబర్ లో భేటీ అయ్యారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేని ఆన్లైన్ రుణ యాప్ ల నిషేధం పై ఆమె కలెక్టర్ తో చర్చించారు. ఆయా కంపెనీల ప్రతినిధులమంటూ.. న్యూడ్ ఫొటోల పేరుతో భయపెడుతున్న కీచకుల భరతం పట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టాల్సిన అవసరాన్ని గజ్జల లక్ష్మి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందన గ్రీవెన్స్ తో పాటు ‘దిశ’ చట్టం యాప్ వంటి వ్యవస్థలపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు మహిళా కమిషన్ సిద్ధంగా ఉందని గజ్జల లక్ష్మి చెప్పారు.

 

 

ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో ఇటీవల వరుస రాజకీయ దాడులు మహిళలపై జరగడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను అడ్డుపెట్టుకుని గ్రామాలలో రాజకీయం నడిపిస్తున్న ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నేతలకు తగిన బుద్ధిచెప్పాలని.. గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రభుత్వ వ్యవస్థలు ఉక్కుపాదం మోపాలని లక్ష్మి కోరారు. ఆయా అంశాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో మహిళా కమిషన్ ను కలుపుకుని పలు చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు సరికొత్త ప్రణాళికను రూపొందిస్తామన్నారు. రాజకీయ దాడులపై పోలీసు, రెవెన్యూ తదితర వ్యవస్థలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీనిచ్చారు.

 

Tags: An exercise in the construction of loan applications

Leave A Reply

Your email address will not be published.