పుంగనూరు రాయలసీమ అకాడమి విద్యార్థులకు సన్మానం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో విద్యార్థులు అబ్యాస్ అకాడమి గ్లోబల్ ఒలంపియాడ్, ఫ్యాక్టో ఒలంపియాడ్ పరీక్షలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం చేశారు. శనివారం ఎంఈవో చంద్ర శేఖర్‌రెడ్డి, అకాడమి డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి , చిల్డ్రన్స్ స్పెషలిస్టు డాక్టర్ చైతన్యతేజారెడ్డి కలసి విద్యార్థులను సన్మానించి, పలు అంశాలపై సూచనలు చేశారు. విద్యార్థులకు మెమెంటోలు, సర్టిపికెట్లు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రావణి, రుపేష్, జగదీష్, ఏసునాథ్, రెడ్డెమ్మ, మునిరత్నం, బుషీరుద్దిన్ పాల్గొన్నారు.

Tags: An honor to the students of Punganur Rayalaseema Academy
