పుంగనూరులో వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి శ్రీకారం

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ కేంద్రమైన పుంగనూరులో ప్రజల వ్యక్తిగత సమస్యలు పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టినట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. బుధవారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, మంత్రి పీఏ చంద్రహాస్‌ , రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణంతో కలసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పట్టణంలోని మంగళం కాలనీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు జగనన్నబావుట పుస్తకాలను పంపిణీ చేశారు. అలీమ్‌బాషా మాట్లాడుతూ పుంగనూరును అన్ని విధాల అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. సచివాలయాలు, వలంటీర్ల ద్వారా సమస్యలను ఇండ్ల వద్దనే పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలిచామన్నారు. పుంగనూరు నియోజకవర్గం సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవల్లో జిల్లాలో అగ్రస్థానంలో నిలిచామని తెలిపారు. సచివాలయాలలో ఉదయం నుంచి రాత్రి దాక సిబ్బంది పని చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు పూలత్యాగరాజు, అమ్ము, నరసింహిలు, జెపి.యాదవ్‌, కాళిదాసు, రామకృష్ణంరాజు, ఆదిలక్ష్మీ, సాజిదా, యువకుమారి, కమలమ్మ, జయభారతి, భారతి, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: An initiative to solve personal problems in Punganur

Leave A Reply

Your email address will not be published.