Natyam ad

పోలవరం మండలం పెద్దమడి గ్రామ ప్రజల వినూతన నిరసన

ముమ్మిడివరం ముచ్చట్లు:

ముమ్మిడివరం నియోజకవర్గం  ఐ. పోలవరం మండలం పెద్దమడి సత్తమ్మ చెట్టు  నుండి టీ. కొత్తపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లే మార్గం  అద్వానంగా ఉండటంవలన గ్రామంలో కొంతమంది ప్రజలు చందాలు వేసుకుని రోడ్డు మరమ్మత్తులు చేసుకుంటున్నారు.తామ పడుతున్న ఇబ్బందులను ఐ పోలవరం గ్రామ సర్పంచి దృష్టికి తీసుకెళ్లిన కనీసం పట్టించుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇదే మార్గంగుండా స్కూల్ కి వెళ్లే పిల్లలు తీవ్ర  ఇబ్బందులు పడుతున్నారని దీనితో ఎవరో స్పందించకపోవడంతో తమ గ్రామంలో ప్రజలు చందాలు వేసుకుని మరమ్మతులు చేసుకుంటున్నారు.  అంతేకాకుండావిద్యుత్తు తీగలు క్రిందకి వేలబడడంతో ఎలక్ట్రికల్ ఏఈకి చెప్పగా మా దగ్గర డబ్బులు లేవు లేబర్ ఖర్చు మీరే పెట్టుకోవాలని చెప్పడంతో తామే తమ సొంత డబ్బులతో స్తంభాలు వేయించుకున్నామనిఆవేదన చెందుతున్నారుజ కనీసం ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి మా యొక్క సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.

 

Tags: An innovative protest by the people of Peddamadi village of Polavaram mandal

Post Midle
Post Midle