ఏపీ విభజన చట్టం అమలు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Date:02/04/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు;
ఏపీ విభజన చట్టం అమలు పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విభజన చట్టం అమలు కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు నాలుగేళ్లుగా విభజన చట్టం ఎందుకు అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్‌ సిక్రీ ధర్మాసనం ప్రశ్నించింది .నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. నాలుగు వారాలు గడువు కావాలని  కేంద్ర ప్రభుత్వం కోరడంతో సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసింది.  సమాధానం ఇవ్వడానికి తమకు నాలుగు వారాల గడువు కావాలని కోర్టును కేంద్రం కోరింది. దీంతో, నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
Tags:An inquiry into the Supreme Court on the implementation of the AP Division Act

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *