Natyam ad

భావన టౌన్ షిప్ క్రమాలపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరపాలి…

22న బహిరంగ సభ…
అఖిలపక్షం ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరణ…

కడప ముచ్చట్లు:

కడప లో సంచలనం సృష్టించుచున్న భావన టౌన్షిపక్రమాలపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరపాలని, 22వ తేదీన భావన టౌన్ షిప్ నందు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు.  22వ తేదీ బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలని విడుదల చేశారు.  ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు, టిడిపి నగర అధ్యక్షుడు శివకొండ రెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ, విలేకరులతో మాట్లాడుతూ, భావన టౌన్షిప్ లో నిర్మితమవుతున్న వెంచర్ పూర్తిగా ప్రభుత్వ భూములలో ఉందని ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకొని అక్రమంగా ఫ్లాట్లు వేసి సెంటు 13 లక్షల తోటి వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.
బుద్ధ ఇన్ఫ్రా వాళ్ళు ఎక్కడ వెంచర్ వేసిన ప్రభుత్వ భూముల్లోనూ అక్రమంగా కబ్జాలు చేస్తు అందులో  మాత్రమే  వెంచర్లు వేస్తారని ఈ సందర్భంగా వారు చెప్పారు.
బుద్ధ టౌన్ షిప్ లో కూడా ఇలానే వంక పోరంబోకు స్మశాన స్థలాన్ని ఆక్రమించుకొని ఈరోజు సెంట్ 22 లక్షల అమ్ముతున్నారని వారు గుర్తు చేశారు, అదే పద్ధతిలో ఈరోజు మూల వంక దగ్గర ఉన్న ఊటూకూరు పొలంలో 50 ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేసి సెంటు 13 లక్షలతో అమ్మకానికి పెట్టారని వారు తెలిపారు.

 

 

Post Midle

ప్రభుత్వ భూములను కాపాడడానికి రెవెన్యూ పోలీస్ అధికారులు ఉంటే! కబ్జా చేసిన వాళ్లకు అండగా ఉండి, వాటిని వ్యతిరేకించిన వారిపై కేసులు  పెడతామనటం  పత్రికలపై కేసులు పెడతామనటం  బెదిరించడం దౌర్జన్యానికి పాల్పడడం అన్నది  విచిత్రంగా ఉందని వారు ఆగ్రహించారు.
కృష్ణ కిషోర్ రెడ్డి దగ్గర కొన్నాం అన్న రాజేంద్ర ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని, ఎకరా 30 లక్షలకు కొన్న రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, 13 కోట్లకు ఎలా అమ్ముతున్నాడు అని వారు ప్రశ్నించారు.
13 కోట్ల విలువచేసే ఎకరా భూమిని మీకు 30 లక్షలకే కృష్ణ కిషోర్ రెడ్డి ఏ బెదిరింపులు లేకుండా భయపెట్టకుండా మీకు ఎలా ఇచ్చాడని చెప్పడానికి ఎలా సాధ్యమవుతుందని దీనిని ఎవరు నమ్మాతారని దీనిపై ప్రశ్నలు వేశారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
నేషనల్ హైవే రోడ్డుని వాళ్ళ సొంత జాగిరిలా మార్చుకున్న తీరుని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై  హైకోర్టు జర్జితో విచారణ జరిపించాలని, 22న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని  వారి డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో ఆర్ సి పి  సీనియర్ నాయకులు లింగమూర్తి, నగర కార్యదర్శి మక్బూల్ బాషా,  రైతు సంఘం నాయకులు ప్రతాపరెడ్డి,  డి జి హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి రాజు, నాయకుడు ప్రసాద్, రవి, లోకేష్, మునేంద్ర. తదితరులు పాల్గొన్నారు.

 

Tags:An inquiry should be held with a retired High Court judge on Bhavana township arrangements…

Post Midle